Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG News: కారును చూసి ఆపకుండా ఆరిచిన కుక్క.. కట్ చేస్తే మున్సిపల్ చైర్మన్ ప్రాణాలు క్షేమం.. అసలు వెహికిల్‌లో ఏముందంటే..?

Khanna, Ludhiana: మనిషికి ఎంతో విశ్వాసపాత్రమైన కుక్కలు మానవ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరం అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అవును, ఎందుకుంటే ఆ విశ్వాసమైన జంతువే పంజాబ్‌లోని ఖన్నా మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కమల్‌జిత్ సింగ్ లాధర్ ప్రాణాలను..

OMG News: కారును చూసి ఆపకుండా ఆరిచిన కుక్క.. కట్ చేస్తే మున్సిపల్ చైర్మన్ ప్రాణాలు క్షేమం.. అసలు వెహికిల్‌లో ఏముందంటే..?
Representative Image
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 20, 2023 | 4:06 PM

Khanna, Ludhiana: మనిషికి ఎంతో విశ్వాసపాత్రమైన కుక్కలు మానవ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరం అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అవును, ఎందుకుంటే ఆ విశ్వాసమైన జంతువే పంజాబ్‌లోని ఖన్నా మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కమల్‌జిత్ సింగ్ లాధర్ ప్రాణాలను కాపాడింది. అసలు ఏం జరిగిందంటే.. కమల్‌జిత్ సింగ్ ఖన్నా బ్యాంక్ కాలనీలోని ఈఓ అధికారిక నివాసానికి తన అధికారిక ఇన్నోవా కార్‌లో వెళ్లారు. ఆయన అక్కడకు చేరుకున్న కొంతసేపటికి ఈఓ అధికార నివాసంలోని పెంపుడు కుక్క ఆపకుండా అరవడం ప్రారంభించింది.

అలాగే ఆ కారులో ఎక్కడానికి ఎవరినీ అనుమానించలేదు. దీంతో అసలు ఏం జరిగిందా అని అక్కడివారు ఎంత ఆలోచించినా అంతుచిక్కలేదు. ఈ క్రమంలో వర్షాకాలం అయ్యేసరికి కారులో పాము దూరి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అంతే వెంటనే ఈఓ అధికారిక నివాసానికి అమ్లో రోడ్ నుంచి రంఝా అనే వ్యక్తిని పిలిపించారు. అతను వచ్చి ఏకంగా 5 పాములను పట్టాడు. అందులో 3 పాములు ఇన్నోవా కారు నుంచి, ఈఓ అధికార నివాసం నుంచి 2 పాములను అతను పట్టుకున్నాడు. అనంతరం ఇంకా పాములు ఉన్నాయేమో అని పూర్తిగా తనిఖీ చేశారు.

కాగా, ఆ అధికారిక ఇన్నోవా కారు మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కమల్‌జిత్‌ సింగ్‌ లాధర్‌‌కి చెందినది కావడంతో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నిజంగానే ప్రాణాలు కాపాడబడ్డాయి. కారులో పాములు ఉన్నాయని ఎవరికీ తెలియదు. డ్రైవర్ కార్‌ని బయట పార్క్ చేశాడు. ఇంతలోనే అక్కడ కుక్క మొరగడంతో కారులో పాము ఉండొచ్చని అంతా అనుమానించారు. కారులో నుంచి 3, ఈఓ అధికారిక నివాసం నుంచి 2 పాములు బయటకు వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దేవుడికి ధన్యవాదాలు’ అని అన్నారు. కాగా, కార్‌ని పార్క్ చేసిన సమయంలో కారులోకి పాములు దూరడాన్ని ఆ పెంపుడు కుక్క చూసి అలా అరిసి ఉంటుందని అక్కడివారు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.