Vande Bharat Express: టాయిలెట్ కోసం వందే భారత్ రైలు ఉపయోగించాడు.. రూ.6 వేలు చెల్లించుకున్నాడు..
Vande Bharat Train: భోపాల్ స్టేషన్‌లో ఒక వ్యక్తి వందేభారత్ రైలులోని బాత్రూమ్ ఉపయోగించడానికి ఎక్కాడు. అతను బాత్రూమ్ నుంచి బయటకు రాగానే.. రైలు కదలడం ప్రారంభించిందని.. దాని తలుపులు లాక్ చేయబడిందని అతను గ్రహించాడు. వందే భారత్ బాత్‌రూమ్‌ని ఉపయోగించినందుకు రూ.6వేలకు పైగా నష్టపోయాడు.
ఓ చిన్న పొరపాటు.. అంత దూరం ఎందుకు అనుకున్న చిన్న నిర్లక్ష్యం.. ఓ రోజు చెడిపోయాలా చేసింది. మానసిక ఆందోళనకు గురిచేసింది.. అంతేకాదు మొత్తం రూ. 6వేల రూపాయల ఖర్చు మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ఇది ఓ రైల్వే ప్రయాణికుడు చేసిన తప్పు. అబ్దుల్ ఖాదిర్ తన కుటుంబంతో కలిసి భోపాల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ వద్ద వారు ప్రయాణించాల్సిన రైలు కోసం చూస్తున్నారు. అతను తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్తున్నాడు. అబ్దుల్ హైదరాబాద్‌లో ఒకటి, సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. హైదరాబాద్ నుంచి భోపాల్‌కు చేరుకున్న వారు రైలులో సింగ్రౌలీకి వెళ్లాల్సి ఉంది. వారు జూలై 15 సాయంత్రం 5.20 గంటలకు భోపాల్ స్టేషన్‌కు చేరుకున్నారు. సింగ్రౌలీకి వారి రైలు రాత్రి 8.55 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వారు ప్లాట్‌ఫారమ్‌పై ఉండగా, అబ్దుల్ బాత్‌రూమ్‌ని ఉపయోగించడానికి ఇండోర్‌కు వెళ్లే వందే భారత్ రైలు ఎక్కాడు.
అయితే, అబ్దుల్ బాత్రూమ్ నుంచి బయటకు రాగానే.. రైలు తలుపులు లాక్ చేయబడ్డాయి. రైలు స్పీడ్ అందుకుంది. ఏం చేయాలో తెలియక అబ్దుల్ వేర్వేరు కోచ్‌లలో ఉన్న ముగ్గురు టిక్కెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసు సిబ్బంది నుంచి సహాయం కోరేందుకు ప్రయత్నించాడు. అయితే వారు డ్రైవర్ మాత్రమే తలుపులు తెరవగలరని అతనికి చెప్పారు. దీంతో చివరి ప్రయత్నంగా డ్రైవర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అతడిని అడ్డుకున్నాడు..
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు రూ.1020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అతను ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి, భోపాల్‌కు బస్సు టిక్కెట్‌పై అదనంగా రూ.750 ఖర్చు చేసుకోవల్సి వచ్చింది.
అబ్దుల్ రైలులో ఇరుక్కుపోయినప్పుడు, అతని భార్య, కొడుకు అతని గురించి మానసిక ఆందోళన చెందారు. ఆమె తరువాత ఏం చేయాలో అనే సందిగ్ధతను ఎదుర్కొన్నారు. అంతేకాదు సింగ్రౌలీకి వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ వదిలిపెట్టుకున్నారు. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్‌రౌలీకి వెళ్లాలనుకున్న రైలు ప్రయాణం కోసం బుక్ చేసిన రూ. 4,000 టిక్కెట్‌లు ఉపయోగించబడలేదు.
వందే భారత్ బాత్‌రూమ్‌ని ఉపయోగించినందుకు అబ్దుల్ కనీసం రూ.6,000 కోల్పోవల్సి వచ్చింది. నాలుగు అడుగులు వేసి వెళ్లాల్సిన పనికి రూ. 6 వేలు, మానసిక ఆందోళన.. రెండింటిని చెల్లించుకోవల్సి వచ్చింది.
మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం