KSRTC Bus: ఉచిత ప్రయాణంతో బస్సులు ఫుల్.. టికెట్లు ఇవ్వడానికి కండక్టర్ల పాట్లు.. వీడియో వైరల్
ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ బస్సులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ శక్తి యోజన ఎఫెక్ట్ వల్ల రాయచూరు గ్రామీణ ప్రాంతాల్లో బస్ కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్ కండక్టర్ ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

కర్ణాటకలోని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. శక్తి యోజన పేరుతో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం (ఉచిత బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ స్కీమ్) పొందారు. అప్పటి నుంచి బస్సులో ఏర్పడుతున్న పరిస్థితుల గురించి అనేక వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ బస్సులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ శక్తి యోజన ఎఫెక్ట్ వల్ల రాయచూరు గ్రామీణ ప్రాంతాల్లో బస్ కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్ కండక్టర్ ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.
రాయచూర్ జిల్లా లింగసుగూర్ తాలూకాలోని ముద్గల్-అంకలిమఠ్-ముదేనూర్ మార్గంలో బస్సు శక్తికి మించి ప్రయాణీకులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో బస్సు కండక్టర్ టికెట్ ప్రయాణీకులకు ఇవ్వలేకపోయాడు. ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో చివర్లో సీటుపై రాడ్‌పై కూర్చొని టిక్కెట్లు ఇచ్చారు. ప్రస్తుతం కండక్టర్ పడుతున్న తిప్పలు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ముదగల్-ముదేనూరు మార్గంలో కెఎస్‌ఆర్‌టిసి బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు షేర్ చేశాడు. కర్ణాటకలో శక్తి యోజన అమలులోకి వచ్చిన తర్వాత, KSRTC బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శక్తి యోజన అమలులోకి వచ్చిన నెల రోజుల్లోనే 16 కోట్ల మంది మహిళా ప్రయాణికులు కెఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించారు. జూలై 4వ తేదీన 70 లక్షల మంది మహిళా ప్రయాణికులు KSRTC బస్సుల్లో ప్రయాణించారు. ఇది ఒకే రోజులో అత్యధిక మహిళా ప్రయాణికులుగా రికార్డ్ సృష్టించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..