Viral Video: టీచర్ పాదాలకు పువ్వులు సమర్పించి నమస్కరించిన స్టూడెంట్.. విద్యార్థి సంస్కారానికి నమస్కారం అంటున్న నెటిజన్లు

ప్రస్తుతం ఓ చిన్నారి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్కూల్ స్టూడెంట్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: టీచర్ పాదాలకు పువ్వులు సమర్పించి నమస్కరించిన స్టూడెంట్.. విద్యార్థి సంస్కారానికి నమస్కారం అంటున్న నెటిజన్లు
Viral Video
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:34 AM

ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని.. మంచి భవిష్యత్ ఏర్పడాలని కోరుకుంటారు. దీని కోసం తమ పిల్లలను కార్పొరేట్ విద్యను అందించడానికి బడాబడా స్కూల్స్ లో చేర్పిస్తారు. అయితే అక్కడ ఉండే ఫీజులు సామాన్యుడుకి అందుబాటులో లేవు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ పైలట్లను మంచి వ్యక్తిగా తయారు చేయాలని ఆలోచిస్తారు . మంచి వ్యక్తిగా మారడానికి..  పెద్ద పాఠశాలలు అవసరం లేదు. విలువలతో కూడిన విద్య అవసరం. తల్లిదండ్రులు ఇంట్లో, పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందించే విలువలు పిల్లలను మంచి మానవులుగా మారడానికి సహాయపడతాయి. ప్రస్తుతం ఓ చిన్నారి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్కూల్ స్టూడెంట్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్కూల్ స్టూడెంట్ స్కూల్‌లో ఓ మేడమ్‌ పాదాలకు పూలు సమర్పించి.. అనంతరం ఆమె పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాడు.  అనంతరం ఉపాధ్యాయురాలు బాలుడిని ఆశీర్వదించారు. క్లాస్‌రూమ్‌లో ఓ ఉపాధ్యాయురాలు నిలబడి ఉండగా.. ఆమె ముందు ఓ చిన్నారి పాలిథిన్‌ కవర్ నుంచి పూలు తీస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ బాలుడు కొన్ని పువ్వులు తీసి ఉపాధ్యాయురాలు పాదాలకు సమర్పించి.. అనంతరం ఆమెకు నమస్కరించాడు. అప్పుడు మేడమ్ ఆ బాలుడిని ఆశీర్వదించి.. ప్రేమతో కౌగిలించుకున్నారు. నేటి కాలంలో.. ఇలాంటి స్టూడెంట్స్ చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ బాలుడు విలువలను కలిగి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @MahantYogiG అనే ఐడితో షేర్ చేయబడింది. ‘ఇలాంటి ఆచారాలు సనాతన ధర్మంలో మాత్రమే సాధ్యమవుతాయి’ అని క్యాప్షన్‌తో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కేవలం 9 సెకన్ల ఈ వీడియో  ఇప్పటివరకు 33 వేలకు పైగా వ్యూస్, 4 వేల మందికి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో, ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ‘ఇలాంటి సనాతన సంస్కారాన్ని అనుసరిస్తున్న  ఈ చిన్నారికి సెల్యూట్’ అని ఒక యూజర్ రాస్తే, ‘స్టూడెంట్ కు సంస్కారం చాలా ఎక్కువగా ఉంది.. కానీ టీచర్ చెప్పులు తీసి ఉంటె.. ఆమె కూడా సంస్కారి అని పించుకునేది అని మరొకరు పేర్కొన్నారు. ‘మీ పిల్లలలో మీ మంచి విలువలను సజీవంగా ఉంచండి, తద్వారా వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..