Watch Video: మనిషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఈ వీడియో చూస్తే మీరూ కాదనలేరు..

మార్కెట్ వీధులలో పనికిరాని కురగాయలను, ఆకుకూరలను ఎక్కడ పడితే అక్కడ పడి ఉండడం మనందరం చూసే ఉంటాం. మార్కెట్ పరిసరాలలో తిరగాడే మూగజీవాలను అలా..

Watch Video: మనిషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఈ వీడియో చూస్తే మీరూ కాదనలేరు..
Cow Eating Vegetables
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 25, 2022 | 2:11 PM

ప్రతిఫలం ఆశించకుండా తోచినంత సాయం, సాధ్యమైనంత ఉపకారం చేయాలనేది పెద్దల మాట. మార్కెట్ వీధులలో పనికిరాని కురగాయలను, ఆకుకూరలను ఎక్కడ పడితే అక్కడ పడి ఉండడం మనందరం చూసే ఉంటాం. మార్కెట్ పరిసరాలలో తిరగాడే మూగజీవాలను అలా పడి ఉన్న కూరగాయలు, ఆకుకూరలను తినేందుకు కూడా అనుమతించరు కొందరు. కానీ ఎవరైనా.. మార్కెట్‌లోకి వచ్చిన ఓ ఆవును తన కూరగాయలను తినడానికి అనుమతిస్తే వారికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలని అందరికీ తప్పక అనిపించే భావన కదా.. అలాంటి మంచి పని చేసే వ్యక్తులలోనే నిజమైన మానవత్వం అనేది ఇంకా  బతికి ఉంది.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ  వీడియో హల్‌చల్ చేస్తోంది. an_u2049 అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు పోస్ట్ చేసిన వీడియోలో.. మార్కెట్ ఏరియాలోని ఓ కూరగాయల వ్యాపారి ఆకలితో ఉన్న ఆవును తన కూరగాయలను తిననివ్వడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో నెటిజన్లను కరిగించి వేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకి లక్ష 80 వేల వీక్షణలు, దాదాపు 30 వేల లైకులు వచ్చాయి. ఆ కూరగాయల వ్యాపారి  వివరాలు పూర్తిగా తెలియవు కానీ ఆమె నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళ ఓ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమె ఓ ఆవును తన కూరగాయలను తిననిచ్చారు. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కూరగాయలను తింటున్న ఆవు వీడియో..

వీడియోలోని చిన్న సెగ్మెంట్ ఇప్పుడు ప్రజల ముఖాలలో చిరునవ్వు కలిగించింది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా నవ్వుకునే అవకాశం ఉంది. కాగా, ఆ వ్యాపారి సాధుగుణానికి నెటిజన్లు ప్రశంసింస్తున్నారు. అందరూ వారికి నచ్చిన రీతిలో ప్రతిస్పందిస్తున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్ చేసి ఆ వ్యాపారిని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..