Andhra News: పతి పత్ని ఔర్ వో..! ప్రియుడితో గుట్టుగా భర్తను లేపేద్దామనుకుంది.. కట్ చేస్తే..
విజయవాడకు చెందిన సంజయ్ పెట్ డాగ్స్ కొనే నిమిత్తం కొన్నాళ్లు క్రితం అమన్ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో నూర్జహాన్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి తరుచూ కుక్కలు కొనే పేరుతో అమన్ ఇంటికి వచ్చి పోతుండేవాడు. అయితే మొదట్లో సంజయ్ పై అమన్ ఎటువంటి అనుమానం లేదు. ఇంటిలో దొంగతనం జరగడంతో అప్పటినుంచి అనుమానం మొదలైంది..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో నూర్జహాన్, అమన్ దంపతులు జీవిస్తున్నారు. వీరు పెట్ డాగ్స్‌ను విక్రయిస్తుంటారు. అయితే కొద్దీ రోజుల క్రితం అమన్ ఇంటిలో చోరి జరిగింది. బంగారు ఆభరణాలను అపహరించారు. చోరి జరిగిన అనవాళ్లు లేకుండానే బంగారు ఆభరణాలతో పాటు ఇంటి డాక్యుమెంట్స్ మాయం కావడంపై అమన్ కు అనుమానం వచ్చింది. అయితే ఈ విషయంపై నూర్జహాన్‌తో పెద్దగా గొడవ పడలేదు అమన్… చోరి జరగడానికి ముందు, ఆ తర్వాత కూడా సంజయ్ అనే వ్యక్తి తరుచూ ఇంటికి వస్తుండటాన్ని అమన్ గమనించాడు. అయితే ఆవన్నీ ఏమి తెలియనట్లు అమన్ నటించసాగాడు.. సంజయ్ పై అనుమానం వచ్చిన అమన్ అతని కదలికలపై నిఘా పెట్టాడు.
విజయవాడకు చెందిన సంజయ్ పెట్ డాగ్స్ కొనే నిమిత్తం కొన్నాళ్లు క్రితం అమన్ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో నూర్జహాన్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి తరుచూ కుక్కలు కొనే పేరుతో అమన్ ఇంటికి వచ్చి పోతుండేవాడు. అయితే మొదట్లో సంజయ్ పై అమన్ ఎటువంటి అనుమానం లేదు. ఇంటిలో దొంగతనం జరగడం, బంగారు ఆభరణాలతో పాటు ఇంటి డాక్యుమెంట్స్ పోవడంపై ఆశ్చర్యపోయిన అమన్ అప్పటి నుండి సంజయ్ రాకపోకలపై దృష్టి పెట్టాడు. అంతేకాదు భార్య ఫోన్ పై కూడా కన్నేసిన అమన్ వాట్సప్ చాటింగ్ లను పరిశీలించాడు. చివరికి వాట్సప్ చాటింగ్ లో ఉన్న విషయాలను చూసి నిర్ఘాంతపోయాడు. ఏకంగా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అమన్ తెలుసుకున్నాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని బటయపెట్టారు.
సంజయ్, నూర్జహాన్ మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరుచూ కలుసుకునేవారు. అయితే వీరికి భర్త అమన్ అడ్డుగా ఉండటంతో అతని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఇందుకోసమే నూర్జహాన్ ఇంటిలోని బంగారు ఆభరణాలు, ఇంటి డాక్యుమెట్స్ తీసి సంజయ్ కి ఇచ్చింది. వాటిని ఎవరికైనా ఇచ్చి అమన్ హత్య చేయించాలని ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు. తానే తీసి చోరి జరిగినట్లు నూర్జహన్ తన భర్తకు చెప్పింది. సంజయ్ విజయవాడకు చెందిన ఒక రౌడీషీటర్ కి బంగారు ఆభరణాలు ఇచ్చి అమన్ ను హత్య చేసే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం జరిగిన తర్వాత రౌడి షీటర్ ఆధ్వర్యంలోని ముఠా రెండు సార్లు రెక్కీ కూడా నిర్వహించింది.
అయితే ఆ తర్వాత అనుమానం వచ్చిన అమన్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు .. ఈ గుట్టును రట్టు చేశారు. అన్ని ఆధారాలు సేకరించిన మంగళగిరి పోలీసలు నూర్జహాన్, సంజయ్, రౌటీ షీటర్ ను అరెస్ట్ చేశారు. తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు అమన్ ధన్యవాదాలు తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..