Watch Video: పాలిస్తున్న తల్లి కుక్క.. అంతలోనే దూసుకొచ్చిన పాము.. మూడు కుక్క పిల్లలు బలి..

జాతి ఏదైనా.. తల్లి తల్లే. తన పిల్లలకు ఆపద వస్తే.. తప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ తల్లి కుక్క తన పిల్లలు ప్రాణపాయంలో ఉండగా..

Watch Video: పాలిస్తున్న తల్లి కుక్క.. అంతలోనే దూసుకొచ్చిన పాము.. మూడు కుక్క పిల్లలు బలి..
Snake Bite
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 26, 2022 | 1:16 PM

జాతి ఏదైనా.. తల్లి తల్లే. తన పిల్లలకు ఆపద వస్తే.. తప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ తల్లి కుక్క తన పిల్లలు ప్రాణపాయంలో ఉండగా.. వాటిని రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు బలయ్యాయి. తన పిల్లలను కాపాడుకునేందుకు ఆ తల్లి కుక్క ప్రయత్నిస్తుండగా.. పక్కనే నిల్చున్న కొందరు వ్యక్తులు మాత్రం మరీ రాక్షసంగా ప్రవర్తించారు. కనీస మానవత్వం చూపలేదు. పాము నుంచి ఆ పిల్లలను కాపాడాల్సింది పోయి.. కాటు వేస్తుంటే ఫోన్లలో వీడియో తీశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని మంతటి గ్రామంలో చోటు చేసుకుంది.

చూపరులను తీవ్రంగా కలచివేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉండే ఓ కుక్క ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఓ బండ చాటున గూడు ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. ఇంతలో వచ్చిన నాగుపాము ఆ కుక్క పిల్లలపై దాడి చేసింది. ఆ పక్కనే ఉన్న తల్లి కుక్క.. పాముతో పోరాడింది. తన పిల్లలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, దాని ప్రయత్న విఫలయత్నంగా మిగిలిపోయింది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు బలైపోయాయి. పాము విషయం ధాటికి విలవిల్లాడుతూ మూడు పిలల్లు ప్రాణాలు కోల్పోయాయి.

ఇక్కడ మరో దారుణం విషయం ఏంటంటే.. పక్కనే కొందరు వ్యక్తులు పాము నుంచి ఆ కుక్క పిల్లలను రక్షించే ప్రయత్నం చేయకపోవడమే. అవును, పాము వచ్చే ఆ కుక్క పిల్లలపై దాడి చేస్తుంటే కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. మూడు కుక్క పిల్లలను చంపేంత వరకు అలాగే వీడియో తీసిన స్థానికులు.. ఆ తరువాత పాముపై దాడి చేసి చంపేశారు. కుక్క పిల్లలపై పాము అటాక్ చేయడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ వీడియో తీసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. స్థానికుల తీరుపై చివాట్లుపెడుతున్నారు. కనీస మానవత్వం కూడా లేకపోతే ఎలాగంటూ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..