శుభ్రతలో నెంబర్‌వన్ నగరంలో ఎలుకల బెడద..! వందేళ్ల బ్రిడ్జిని తుక్కుతుక్కుగా కొరికేశాయ్..
ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందు ఉన్న వంతెనలోని ఒక భాగం కూలిపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లీంచారు.

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్రతిసారీ టైటిల్‌ను గెలుచుకుంటుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. అలాంటి సుందర నగరంలో గత ఆదివారం నవంబర్ 2న జరిగిన ఒక సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నగరంలోని పురాతనమైన, అత్యంత రద్దీగా ఉండే శాస్త్రి వంతెనలోని కొంత భాగం ఆదివారం అకస్మాత్తుగా కూలిపోయింది. అదృష్టవశాత్తూ వంతెన కూలిపోయిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. రద్దీ సమయాల్లో ప్రమాదం జరిగి ఉంటే , అది పెద్ద విపత్తుకు దారితీసి ఉండేది. తీవ్ర ప్రాణనష్టానికి దారితీసేది. గాంధీ విగ్రహం నుండి శాస్త్రి మార్కెట్‌కు వెళ్లే సందులో రోడ్డు అకస్మాత్తుగా గుంతలు పడింది. దాదాపు ఐదు అడుగుల లోతు, ఆరు అడుగుల పొడవున్న గుంత ఏర్పడటం ప్రజల్ని భయాందోళనలకు గురిచేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే…
ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందు ఉన్న వంతెనలోని ఒక భాగం కూలిపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లీంచారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ బృందం రంగంలోకి దిగింది. రోడ్డుపై ఏర్పడిన గుంతను పూడ్చేందుకు ఏర్పాటు చేశారు. కానీ, అంతలోనే అక్కడ షాకింగ్ సీన్ కనిపించింది. రోడ్డుపై ఏర్పడ్డ ఖాళీని పూడ్చడానికి వచ్చిన సిబ్బందికి వంతెన కింద పెద్ద బొయ్యారమే కనిపించింది. ఇక్కడ ఎలుకలు పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయని తెలిసింది. వంతెనపై లోపలి భాగంలో ఎలుకలు మట్టిని తవ్వి అక్కడ పూర్తిగా బోలుగా చేశాయి. దీని వల్ల వంతెనలో ఒక భాగం కుంగిపోయింది. ఆ స్థలంలో 20 కి పైగా బొరియలు గుర్తించారు.
ఈ ఎలుకలు వంతెన కింద ఉన్న మట్టిని పూర్తి తవ్వేడంతో రోడ్ కుంగిపోయిందని అధికారులు తేల్చారు. అయితే, ఇండోర్‌లో ఎలుకల బెడద ఇదే మొదటిసారి కాదు . గతంలో, ఎలుకలు MY హాస్పిటల్, విమానాశ్రయం వంటి ముఖ్యమైన ప్రదేశాల్లోనూ బీభత్సం సృష్టించాయి. కానీ, నగరంలోని 100 సంవత్సరాల పురాతనమైన, అతి ముఖ్యమైన వంతెనపై ఎలుకల దాడి అధికార యంత్రాంగంతో పాటు ప్రజల్ని కూడా ఆందోళనకు గురిచేసింది. నగర పారిశుధ్యం, మౌలిక సదుపాయాల నిర్వాహణపై ప్రజల్లో తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…




