డిజిటల్ ఇండియాలో పెళ్లిళ్లు ఇలాగే ఉంటాయ్ మరీ..! వధువు తండ్రి ఐడియా అదుర్స్..
మనది డిజిటల్ ఇండియా...ఇది వ్యాపారాలు, దుకాణాలకే పరిమితం కాలేదు. వివాహాల్లోకి కూడా ప్రవేశించింది. కేరళలో జరిగిన ఒక వివాహం సందర్భంగా కనిపించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వధువు తండ్రి తన చొక్కాపై Paytm QR కోడ్ ధరించి కనిపించాడు. దీని వలన అతిథులు UPI ద్వారా నేరుగా పెళ్లి కట్నాలు సమర్పించుకునే వెసులుబాటు కల్పించారు

మనది డిజిటల్ ఇండియా…ఇది వ్యాపారాలు, దుకాణాలకే పరిమితం కాలేదు. వివాహాల్లోకి కూడా ప్రవేశించింది. కేరళలో జరిగిన ఒక వివాహం సందర్భంగా కనిపించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వధువు తండ్రి తన చొక్కాపై Paytm QR కోడ్ ధరించి కనిపించాడు. దీని వలన అతిథులు UPI ద్వారా నేరుగా పెళ్లి కట్నాలు సమర్పించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ వీడియోలో పెళ్లికి వచ్చిన అతిథులు వధువు తండ్రి QR కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్‌గా డబ్బు పంపుతుండటం కూడా కనిపిస్తోంది. ఈ వివాహంలో ఎటువంటి ఎన్వలప్‌లు ఇవ్వటం లేదు. ఎవరూ కట్నాలు రాస్తూ ఓ పక్కన కూర్చోవాల్సిన అవసరం లేదు. పెళ్లికి వచ్చిన అతిథులు నగదు రహిత బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రజలు దీనిని డిజిటల్ ఇండియాకు నిజమైన ఉదాహరణగా అభివర్ణించారు. వధువు తండ్రి క్రియేటివిటీని ప్రశంసించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. చాలా మంది హాస్యాస్పదంగానే ప్రశంసలు కురిపించారు. ఒకరు వీడియోపై స్పందిస్తూ..కేరళ 100శాతం అక్షరాస్యతతో ఉంది! అందుకే ప్రతిచోటా సాంకేతికత అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్య దుబారా వివాహ ఖర్చులను తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి సహాయపడుతుందని చాలా మంది అన్నారు.
అయితే, ఇదంతా నిజమేనా లేదంటే, స్క్రిప్ట్ చేసిన వీడియోనా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు. కాగా, మరికొందరు ఆ వ్యక్తి వధువు తండ్రి కాదని, ఆమె మామ అని పేర్కొన్నారు. ఈ వీడియో వినోదం కోసం తయారు చేయబడింది. QR కోడ్‌ను స్కాన్ చేసిన అతిథులు కూడా కుటుంబ సభ్యులే అంటూ ఇంకొందరు రాశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఏది ఏమైనా వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నేటి వివాహాలు సాంకేతికతకు అనుకూలంగా మారుతున్నాయి. UPI చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. వివాహ ఆహ్వానాలను వాట్సాప్ ద్వారా పంపుతున్నట్లే, వివాహాలలో కట్నాలు కూడా త్వరలో నగదు రహితంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో, పెళ్లి కట్నాల ఎన్వలప్‌ను QR కోడ్‌తో భర్తీ చేసే అవకాశం ఉందంటూ చాలా మంది కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




