గుండెను ఉక్కులా మార్చే అద్భుత దోశ..! ఒక్కసారి తిన్నారంటే రోజూ కావాలంటారు..లాభాలు తెలిస్తే…
బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి ఇతర వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన బ్లాక్ రైస్ తో కేవలం అన్నం మాత్రమే కాదు.. మీకు ఇష్టమైన దోశలు కూడా తయారు చేసుకోవచ్చు.. బ్లాక్ రైస్ దోశల తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం...

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఊబకాయం సమస్య ప్రజలలో సర్వసాధారణంగా మారింది. అధిక బరువు కారణంగా ఇతర అనేక వ్యాధులు ప్రజల్ని వెంటాడుతున్నాయి. కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి వారికి బ్లాక్ రైస్ అద్భుత ఔషధంగా నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు బ్లాక్ రైస్‌లో సమృద్ధిగా ఉన్నాయి. బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి ఇతర వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన బ్లాక్ రైస్ తో కేవలం అన్నం మాత్రమే కాదు.. మీకు ఇష్టమైన దోశలు కూడా తయారు చేసుకోవచ్చు.. బ్లాక్ రైస్ దోశల తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం…
గుండె ఆరోగ్యంగా ఉండడానికి డైట్‌తో కూడిన ఆహారాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. మంచి ఆహారాలు తింటేనే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం యువతలో ఎక్కువగా గుండె సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి బ్లాక్ రైస్ దోస అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే.. రైస్‌తో తయారుచేసిన దోశలో ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండెను శక్తివంతంగా తయారు చేస్తుంది. ఈ దోశను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్లాక్ రైస్ దోశ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో బ్లాక్ రైస్, మినప్పప్పు, టీ స్పూన్ మెంతులను వేసి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఇవి బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో తగినన్ని అటుకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. సాధారణ దోశలకు ఎలాగైతై పిండిని తయారు చేస్తామో అదే విధంగా ఈ బ్లాక్ రైస్ దోశ పిండిని కూడా సిద్ధం చేసుకోవాలి.
మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లో వేసుకొని దాదాపు రెండు గంటలపాటు అలాగే పక్కన పెట్టుకోండి. పిండి బాగా నానిన తర్వాత స్టవ్ పై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోండి. స్టవ్‌పై దోశ పెనం వేడి అయిన తర్వాత దానిపై కొంచెం నెయ్యి వేసుకొని.. పిండితో దోశలు పోసుకోండి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇలా తయారుచేసిన దోశను రోజు బ్రేక్ ఫాస్ట్ లో తింటే.. గుండె సమస్యలతో పాటు మధుమేహం సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








