Watch: గుజరాత్ పలన్‌పూర్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు.. పల్టీలు కొడుతూ..
కారు డివైడర్‌ను దాటి.. ఎదురుగా ఉన్న లేన్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పాలన్‌పూర్ నుండి దీసా వైపు హై స్పీడ్‌తో వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ఢీకొన్నసమయంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కారు డివైడర్‌ను దాటి, ఎదురుగా పడిపోయి, ఆ తరువాత బోల్తా పడింది.

వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.. ఈ షాకింగ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని పాలన్‌పూర్–దీసా హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా స్టంట్‌లకు మించి పోయిన ఈ ప్రమాద సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌లోని పాలన్‌పూర్–దీసా హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసా వైపు వెళ్తున్న ఓ కారు.. భారీ వేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు డివైడర్‌ను దాటి.. ఎదురుగా ఉన్న లేన్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పాలన్‌పూర్ నుండి దీసా వైపు హై స్పీడ్‌తో వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ఢీకొన్నసమయంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కారు డివైడర్‌ను దాటి, ఎదురుగా పడిపోయి, ఆ తరువాత బోల్తా పడింది.
వీడియో ఇక్కడ చూడండి..
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. మరో ప్రయాణీకుడు క్షేమంగా ఉన్నాడు. వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌లో కారు హైవేపై వేగంగా వెళుతూ, ఆపై అకస్మాత్తుగా అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డుకు అవతలి వైపుకు దూసుకెళ్లటం కనిపిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




