Health Tips: అమేజింగ్.. ఈ 3 పదార్థాలను కలిపి 3 రోజులు తింటే ఆ సమస్యకు వెంటనే రిలీఫ్..
మలబద్దానికి మందులు వాడి పేగులను పాడు చేసుకోవద్దు. సహజంగా తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాలి. కివి, చియా గింజలు, దాల్చినచెక్క.. ఈ మూడింటిని కలి తీసుకుంటే అద్భుతమే జరుగుతుంది. కేవలం 3 రోజుల్లో మీ మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలా అనేది తెలుసుకుందాం..

మలబద్ధకం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. ఈ సమస్య ఉన్న చాలా మంది వెంటనే మెడికల్ షాపుల్లో దొరికే లాక్సేటివ్‌లు తీసుకుంటారు. అయితే ఇలా తరచుగా చేయడం వల్ల శరీర సహజ ప్రక్రియ దెబ్బతిని, ప్రేగులు చికాకుకు గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సహజ పద్ధతుల్లో మలబద్ధకాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉత్తమం. పోషకాహార నిపుణురాలు ఖుషీ ఛబ్రా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ సమస్యకు అద్భుతమైన సహజ పరిష్కారాన్ని వెల్లడించారు.
కేవలం 3 రోజులు చాలు
మీరు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి చేయవలసిందల్లా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ వరుసగా 3 రోజులు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడమే.
- ముందుగా కివి పండును ముక్కలుగా కోయండి.
- ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను నీటిలో నానబెట్టండి.
- నానబెట్టిన చియా గింజలు, కివి పండ్ల ముక్కలు కలిపి.. అందులో ఒక చిటికెడు దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడిని కలపండి.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ మూడు పదార్థాల కలయిక ప్రేగు కదలికలను మెరుగుపరచడానికి శాస్త్రీయంగా సహాయపడుతుంది.
కివి పండు
కివి పండులో యాక్టినిడిన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసి.. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కివిలోని కరగని ఫైబర్ మలం పరిమాణాన్ని పెంచుతుంది. మలాన్ని మృదువుగా చేస్తుంది. తద్వారా సులభంగా విసర్జన జరుగుతుంది.
జెల్ నిర్మాణం
చియా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు అవి తమ బరువు కంటే 10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని.. జెల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ జెల్ పేగులను మృదువుగా ఉంచి, మలం సులభంగా బయటకు పోయేలా చేస్తుంది. వీటిలో ఉండే ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రీబయోటిక్ ఫైబర్‌లు గట్‌లోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఉబ్బరం, అసౌకర్యం వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం
పోషకాహార నిపుణుల సలహా ప్రకారం.. మీరు ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంటే రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం మర్చిపోకూడదు. ఎటువంటి మందులు లేకుండా సహజంగా జీర్ణక్రియను నియంత్రించుకోవడానికి ఈ మూడు పదార్థాల కలయిక అద్భుతంగా పనిచేస్తుంది.
View this post on Instagram
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




