AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచులోనూ ఆగని ఆటో రిక్షా..! SUVలకే సవాల్ విసురుతూ పరుగులు.

మనాలి నుండి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పర్యాటకులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నట్లు, లగ్జరీ కార్లు మంచు మీద జారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. హిమపాతం తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్నడ్రైవర్లకు కూడా ఇక్కడ డ్రైవింగ్‌ అంటే చెమటలు పడుతుంటారు.

మంచులోనూ ఆగని ఆటో రిక్షా..! SUVలకే సవాల్ విసురుతూ పరుగులు.
Manali Snow Auto Rickshaw
Jyothi Gadda
|

Updated on: Jan 29, 2026 | 9:46 PM

Share

మనాలి నుండి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పర్యాటకులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నట్లు, లగ్జరీ కార్లు మంచు మీద జారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. హిమపాతం తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్నడ్రైవర్లకు కూడా ఇక్కడ డ్రైవింగ్‌ అంటే చెమటలు పడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి 4×4 వాహనాలపై మంచు గొలుసులు అమర్చిన వారు కూడా ముందుకు సాగడానికి వెనుకాడతారు. ఖరీదైన కార్లు మంచులో కురుకుపోయి కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అక్కడి లోకల్‌ ఆటో రిక్షా ఒకటి ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం వీడియో కాదు.. కొండంత ధైర్యం, అనుభవాన్ని తెలియజేసే కథను చెబుతుంది.

ఈ వైరల్ వీడియోలో మంచుతో కప్పబడిన రోడ్డు వెంట ఒక సాధారణ ఆటోరిక్షా దూసుకుపోవటం కనిపిస్తుంది. హైటెక్ వ్యవస్థలు, స్నో చైన్‌లు లేకుండా ఆ ఆటో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతోంది.. ఇక్కడ ఇంకా షాకింగ్‌ విషయం ఏమిటంటే ఆటో ప్రయాణీకులను తీసుకువెళుతోంది. అంటే అది బలహీనంగా లేదు. ఖరీదైన వాహనాలు క్రాల్ చేస్తున్న చోట, ఈ లోకల్‌ ఆటో రిక్షా బాస్ లాగా కదులుతుంది. అది అన్ని అంచనాలు, అందరి అవగాహనలను తారుమారు చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను Xలో iNikhilSaini అనే యూజర్ షేర్ చేశారు. ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఇప్పటికే 150,000 కంటే ఎక్కువ వ్యూస్‌ సంపాదించింది. నిజమైన శక్తి 4×4 లో కాదు, 3×3 లో ఉందని ప్రజలు సరదాగా చెబుతున్నారు. నెటిజన్లు వాహనం కాదు, డ్రైవర్ అనుభవం అని నమ్ముతారు. పర్వత డ్రైవర్లు ప్రతి మలుపును, ప్రతి పరిస్థితిని ఎలా చదవాలో తెలుసుకుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..