AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ పిండి కలపడం నుంచి విముక్తి..ఈ ఈజీ ట్రిక్‌ మీకోసమే!

గుండ్రని, మెత్తటి రోటీలు చేయాలంటే పిండిని సరిగ్గా తడపడం చాలా మందికి కష్టం. చేతులకు అంటుకోవడం, పొడిబారడం, పల్చబడటం వంటి సమస్యలు వస్తాయి. ఈ వ్యాసంలో పిండిని సులభంగా, త్వరగా తడపడానికి ఓ సింపుల్ ట్రిక్ అందిస్తున్నాం. నీటి కుళాయి కింద పిండిని ఎలా కలపాలో, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా పొందాలో వివరించాం. దీంతో పాటు గుండ్రని చపాతీలు చేసే చిట్కాలు నేర్చుకోండి.

ప్రతిరోజూ పిండి కలపడం నుంచి విముక్తి..ఈ ఈజీ ట్రిక్‌ మీకోసమే!
Dough Kneading Hack
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2026 | 7:27 PM

Share

గుండ్రని రోటీలు తయారు చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అలాగే, పిండిని తడుపుకోవడం కూడా మరింత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ చపాతీలు చేయాల్సి వచ్చినప్పుడు, పిండిని పిసికి అలవాటు లేని వారికి ఇది మరింత కష్టం అవుతుంది. పిండి పిసికి కలుపుతున్నప్పుడు కొన్నిసార్లు అది చేతులకు అంటుకుంటుంది, కొన్నిసార్లు అది చాలా పొడిగా మారుతుంది. కొన్నిసార్లు చాలా పల్చగా అవుతుంది. మెత్తటి రోటీ కోసం, పిండిని సరిగ్గా పిసికి పెట్టడం చాలా ముఖ్యం. అంతేకాదు.. పిండిని తడపాలంటే, చేతులు కూడా నొప్పి పుడుతుంటాయి. మీరు కూడా పిండిని పిసికి తడిపేందుకు ఇబ్బంది పడుతుంటే, మీ కోసమే ఈ ఈజీ ట్రిక్‌.ఈ ట్రిక్‌తో మీరు పిండిని త్వరగా పిసికి కలుపుతారు. ఎంత నీరు కలపాలో తెలియక ఆందోళన పడాల్సిన అవసరం కూడా ఉండదు.

పిండి పిసికి, చపాతీలు తయారు చేయటం కష్టంగా అనిపిస్తే, ఈ సింపుల్ హ్యాక్ ని ప్రయత్నించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో పొడి పిండిని తీసుకోండి. ఇప్పుడు మీ మంచినీటి కుళాయిని సన్నగా విడవండి..ఆ నీరు చాలా కొద్ది కొద్దిగా పడేలా ఉండాలి. ఇప్పుడు పిండి గిన్నెను నీటి కింద ఉంచి, తేలికగా చేతులతో కలుపుతూ ఉండండి. పిండి మొత్తం తడిసిన వెంటనే, కుళాయిని ఆపివేయండి. ఇప్పుడు మీ చేతులతో పిండిని బాగా పిసికి కలుపుకోండి. దీని తరువాత, పిండిపై కొద్దిగా నూనె రాసి, మళ్ళీ రెండు మూడు సార్లు పిసికి కలుపుకోండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్ పిండి సిద్ధంగా ఉంటుంది. రోటీలు తయారుచేసే ముందు, కొంతసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేస్తే పిండి మరింత మృదువుగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

చపాతీలు గుండ్రంగా రావాలంటే..: 

గుండ్రని రోటీ తయారు చేయడానికి మంచి పిండి తయారు చేయడం ముఖ్యం. ఇప్పుడు చపాతీలకోసం కావాల్సిన సైజుకు సరిపడేలా పిండిని బాల్స్‌ చేసుకోవాలి. పొడి పిండిలో ఈ బాల్‌ని ముంచి, చపాతీ కర్రతో చక్కగా వత్తుకోవాలి. చపాతీ కర్రను అనువుగా తిప్పుతూ ఉంటే.. చపాతీ ఆకారం కూడా గుండ్రంగా వస్తుంది. ఇలా రెండు లేదా మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే, మీరు సులభంగా గుండ్రని చపాతీలు తయారు చేసుకోవచ్చు. లేదంటే, చపాతీకి నెయ్యి రాసుకుని మూడు కోణాలు, లేదంటే నాలుగు మడతలుగా కూడా తయారు చేసుకుని కాల్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..