AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మంచు కొండల్లో జరిగిన పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం..! వెడ్డింగ్‌ సీన్‌ వైరల్‌..

వసంత పంచమి నాడు ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన లోయలలో ఆవిష్కృతమైన ఒక దృశ్యం సోషల్ మీడియాను ఆకర్షించింది. మీరట్‌కు చెందిన ఒక జంట త్రియుగినారాయణ ఆలయంలో భారీ హిమపాతం మధ్య వివాహం చేసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చుట్టూ కురుస్తున్న మంచు, అందంగా అలంకరించబడిన పెళ్లి మండపం ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

Viral Video: మంచు కొండల్లో జరిగిన పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం..! వెడ్డింగ్‌ సీన్‌ వైరల్‌..
Snow Wedding Uttarakhand
Jyothi Gadda
|

Updated on: Jan 26, 2026 | 5:14 PM

Share

వసంత పంచమి నాడు ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన లోయలలో ఆవిష్కృతమైన ఒక దృశ్యం సోషల్ మీడియాను ఆకర్షించింది. మీరట్‌కు చెందిన ఒక జంట త్రియుగినారాయణ ఆలయంలో భారీ హిమపాతం మధ్య వివాహం చేసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చుట్టూ కురుస్తున్న మంచు, అందంగా అలంకరించబడిన పెళ్లి మండపం ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

గత కొన్ని రోజులుగా పర్వతాలలో భారీ హిమపాతం కురుస్తోంది. జనవరి 23 శుక్రవారం రోజున వాతావరణం కాస్త మెరుగుపడటంతో ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా త్రియుగినారాయణ ఆలయం, దాని పరిసరాలు దట్టమైన మంచు పొరతో కప్పబడి ఉన్నాయి. ఈ అందమైన వాతావరణం మధ్య, వసంత పంచమి శుభ సందర్భంగా ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. మీరట్ నుండి వచ్చిన ఒక జంట ఆలయ ప్రాంగణంలో వేద ఆచారాలకు అనుగుణంగా అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు నడిచారు. చుట్టూ కురుస్తున్న మంచు, అందంగా అలంకరించబడిన పెళ్లి మండపం ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో వధువు ఎరుపు రంగు లెహంగాలో మంచు మీద జాగ్రత్తగా నడుస్తుండటం మనంలు చూడవచ్చు. వరుడు షేర్వానీపై జాకెట్ ధరించి కనిపిస్తాడు. వధువు లెహంగా పట్టుకుని వెనుక ఒక మహిళ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరి ముఖాల్లో ఆనందం, ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పురాణాల ప్రకారం, త్రియుగినారాయణ ఆలయం శివుడు, పార్వతి దేవి వివాహ స్థలంగా పరిగణిస్తారు. అందుకే చాలా జంటలు ఇక్కడ వివాహం చేసుకోవాలని కలలు కంటారు. వైరల్ వీడియోలో వరుడు కెమెరా వైపు చూస్తూ నాకు దేవుడి ఆశీర్వాదం లభించింది అని చెప్పాడు. వివాహం తర్వాత ఆ జంట తమను తాము మీరట్ నివాసితులుగా ప్రకటించారు.

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించిన వెంటనే చాలా మంది నెటిజన్లు స్పందించారు. అంతటి మంచులో పెళ్లి చూడటం ఇదే మొదటిసారి అంటూ చాలా మంది వ్యాఖ్యానించారు. మరికొందరు ఇంత చలిలో కూడా వధువు చాలా అందంగా కనిపించిందని అన్నారు.

ఇదిలా ఉంటే,. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్, కుమావున్ డివిజన్లలో ఈ సీజన్‌లో తొలిసారిగా భారీ హిమపాతం కురవడం వార్తల్లో నిలిచింది. బద్రీనాథ్, కేదార్‌నాథ్, ఔలి, ముస్సోరీ, మున్సారీ, నైనిటాల్‌లోని అనేక ప్రాంతాలు దట్టమైన మంచుతో కప్పబడి ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మంచు కొండల్లో పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం! వెడ్డింగ్‌ సీన్ వైరల్
మంచు కొండల్లో పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం! వెడ్డింగ్‌ సీన్ వైరల్
మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా.. వీటితో మాయం చేయండి
మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా.. వీటితో మాయం చేయండి
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!
పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!