Viral Vidoe: ఈమె భార్య కాదు భయంకర భూతం.. బైక్ నడుపుతున్న భర్తను 27 సెకన్లలో 14 సార్లు కొట్టేసింది..
బైక్‌పై భార్య తన భర్తను కొట్టిన 'ఘర్ కా కలేష్' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భర్త ఎలాంటి ప్రతిస్పందన లేకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు. ఈ వీడియో వినోదాత్మకంగా ఉందా లేదా గృహ హింసకు సంకేతమా అని నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి భార్యాభర్తల గొడవ వీడియోలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో పాములు, జంతువులు, పశుపక్షులు మాత్రమే కాదు..మనుషులకు సంబంధించిన వీడియోలు కూడా అనేక వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల, ఘర్ కా కలేష్ అనే వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు దంపతులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఇల్లాలు సదరు భర్తకు చుక్కలు చూపించింది. జుట్టు పట్టి చెడామడా కొట్టేసింది. పాపం ఆ యువకుడు ఏ మాత్రం స్పందించకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు.
ఈ వీడియో దాదాపు 27 సెకన్ల నిడివి ఉంది. ఆ మహిళ మొదట ఆ యువకుడిని ఒక చేత్తో, తరువాత రెండు చేతులతో వరుసగా 14 సార్లు కొట్టింది. ఆమె అతని జుట్టును పట్టుకుని లాగుతూ అతన్ని వణికించింది. కానీ, పాపం ఆ యువకుడు మాత్రం ఎలాంటి స్పందనా లేకుండా ప్రశాంతంగా బైక్ నడపటం కొనసాగించాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. అతను తన మాజీతో చాట్ చేస్తున్నప్పుడు భార్య అతన్ని పట్టుకుంది. అని వీడియో క్యాప్షన్‌లో రాసి ఉంది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు దీనిని వినోదభరితంగా భావిస్తుండగా, మరికొందరు దీనిని గృహ హింసకు హెచ్చరిక సంకేతంగా వ్యాఖ్యానిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
Kalesh b/w Couple on bike (Recorded by Kaleshi bois) pic.twitter.com/qlZnjH3Ops
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 12, 2026
ఈ సంఘటన కేవలం వినోదం కోసం కాదు. బైక్‌లు లేదా ఇతర వాహనాలపై భార్యాభర్తల తగాదాలను చిత్రీకరించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇక్కడ మరో సందేహం కూడా వ్యక్తం చేశారు నెటిజన్లు. ఇది కేవలం యాదృచ్చికమా, లేక బైక్ తగాదాలు సర్వసాధారణం అవుతున్నాయా?అని అడుగుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




