AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

ప్లేటులో వేడివేడిగా, కరకరలాడుతూ.. నోరూరించే మసాలాల ఘుమఘుమలతో కనిపించే చికెన్ 65 అంటే ఇష్టపడని వారుండరు. రెస్టారెంట్‌కు వెళ్లినా, దావత్ చేసుకున్నా మన మెనూలో ఉండాల్సిన ఫస్ట్ ఐటమ్ ఇదే.. అయితే అసలు ఈ వంటకానికి ఈ వింత పేరు ఎలా వచ్చింది? అనేదాన్నా గురించి ఎప్పుడైన ఆలోచించారా..?

Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..
Why Is It Called Chicken 65
Krishna S
|

Updated on: Jan 25, 2026 | 10:16 PM

Share

రెస్టారెంట్‌కు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా నాన్-వెజ్ ప్రియులు ముందుగా ఆర్డర్ చేసే వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ స్పైసీ వంటకం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 అనే అంకెకు, చికెన్‌కు ఉన్న సంబంధం ఏంటి? దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం.

1965.. బుహారీ హోటల్.. అసలు చరిత్ర ఇదే

చాలా మంది ఆహార చరిత్రకారుల ప్రకారం.. చికెన్ 65 పుట్టినిల్లు మన పక్క రాష్ట్రమైన తమిళనాడు. 1965లో చెన్నైలోని ప్రసిద్ధ బుహారీ హోటల్ వ్యవస్థాపకుడు ఎ.ఎం.బుహారీ ఈ ప్రత్యేక వంటకాన్ని మొదటిసారిగా పరిచయం చేశారు. ఆ సంవత్సరం గుర్తుగా దీనికి చికెన్ 65 అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ హోటల్‌లోనే చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 వంటి మరికొన్ని వంటకాలు కూడా మెనూలోకి వచ్చాయి. కానీ 65 సాధించిన క్రేజ్ దేనికీ దక్కలేదు.

ప్రచారంలో ఉన్న మరికొన్ని వింత కథలు

  • చికెన్ 65 పేరు మీద అనేక ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి
  • ఈ వంటకంలో 65 రకాల మసాలా దినుసులు వాడతారని కొందరు..
  • కోడిని 65 ముక్కలుగా కోసి చేస్తారని మరికొందరు..
  • ఆ కాలంలో చెన్నైలో ఉన్న సైనికులకు స్థానిక భాష రాక మెనూలో 65వ నంబర్‌లో ఉన్న ఈ వంటకాన్ని వేలు చూపించి ఆర్డర్ చేసేవారని, అలా దీనికి ఆ పేరు స్థిరపడిపోయిందని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే వీటికి చారిత్రక ఆధారాలు లేవు.

ప్రత్యేకత ఏంటి?

చికెన్ 65 కేవలం ఒక ఫ్రై మాత్రమే కాదు, దాని మ్యారినేషన్‌లోనే అసలైన రుచి ఉంటుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మొక్కజొన్న పిండి, ఎర్ర కారం, కరివేపాకులను వాడి చికెన్‌ను డీప్ ఫ్రై చేస్తారు. చివరగా పచ్చిమిర్చి, కరివేపాకు పోపుతో దీనికి ఇచ్చే ఫినిషింగ్ ఆ అరోమాను అమాంతం పెంచేస్తుంది. ప్రస్తుతం చికెన్ 65 భారతీయ ఆహార సంస్కృతిలో ఒక భాగమైపోయింది. చికెనే కాకుండా, వెజిటేరియన్స్ కోసం పనీర్ 65, గోబీ 65, మష్రూమ్ 65 వంటి వెరైటీలు కూడా ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. హైదరాబాదీ స్టైల్, ఆంధ్రా స్టైల్ అంటూ ప్రాంతాన్ని బట్టి దీని రుచి మారుతున్నా.. ఆ పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా