AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి సాక్షిగా..ప్రవహించే నదిలో చేపను వేటాడిన పాము..షాకింగ్ వీడియో వైరల్‌..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరుదైన వీడియోలో, ఒక పాము నదిలో తాడుపై వేలాడుతూ అసాధారణ రీతిలో చేపను వేటాడింది. నీటిలో పడినా చేపను వదలని ఈ వింత వేట నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. పాముల చేపల వేటలో ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

ప్రకృతి సాక్షిగా..ప్రవహించే నదిలో చేపను వేటాడిన పాము..షాకింగ్ వీడియో వైరల్‌..
Snake Hunted The Fish
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2026 | 8:19 PM

Share

వన్యప్రాణుల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అడవిలో జంతువుల జీవన విధానం, వాటి వేటకు సంబంధించిన వీడియోలను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు. కొన్నిసార్లు ఒక జంతువు మరొక జంతువును వేటాడటం లేదా కొన్నిసార్లు తన ప్రాణాలను కాపాడుకోవడానికి క్రూర జంతువుల నుండి తప్పించుకోవడానికి పారిపోయే చిన్న జంతువులు వంటివి కనిపిస్తాయి. అలాంటి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియోలో ఒక పాము అసాధారణ రీతిలో ఒక చేపను వేటాడటం కనిపిస్తుంది. పాములు ఈ విధంగా వేటాడటం చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఈ వీడియో అడవిలో ప్రవహిస్తున్న ఒక నదితో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక పాము తాడుపై వేలాడుతూ నదిలో చేపను పట్టుకుంటుంది. చేపను వేటాడిన ఆ పాము ఏకంగా నదిలోకి దూకి మరీ ఆ చేపను తన నోటిలో పట్టుకుంటుంది. ఆశ్చర్యకరంగా, అది ప్రవహించే నీటిలో పడిపోయిన తరువాత కూడా చేపను వదలదు. పాము చేపలను వేటాడే విధానం నిజంగానే అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే పాములు ఈ విధంగా వేటడం గతంలో ఎప్పుడూ చూసి ఉండరు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @NatureChapter అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేయబడింది. ఈ 31 సెకన్ల వీడియోను 554,000 సార్లు చూశారు. వందలాది మంది వివిధ రకాలుగా వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..