AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30ఏళ్ల కాపురంలో.. మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. చివరకు ఏం చేసిందంటే..

ఇటీవలి కాలంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా విడాకులు వివాహమైన 2 నుంచి 5 ఏళ్ల కాలంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ఒక మహిళ 30 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు తీసుకుంది. అవును, 30 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా సునామీ లాంటి సమస్య ఎదురైంది. సదరు మహిళ తన భర్తకు ఉన్నటువంటి అసహ్యకరమైన, వింత అలవాట్ల గురించి తెలుసుకున్న వెంటనే తనతో సంబంధాన్ని తెంచివేసుకుంది. ఇంతకీ అతడికి ఉన్న ఆ అలవాటు ఏంటి..? ఎందుకు ఆమె విడాకుల వరకు వెళ్లాల్సి వచ్చింది.. పూర్తి డిటెల్స్‌ తెలియాలంటే....

30ఏళ్ల కాపురంలో.. మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. చివరకు ఏం చేసిందంటే..
Husband's Secret Habit
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2026 | 4:29 PM

Share

నివేదిక ప్రకారం, ఒక మహిళ తన 30 ఏళ్ల వివాహ జీవితాన్ని విడాకులతో ముగింపు చెప్పింది. ఇంతకాలం ఎంతో ప్రేమగా ఉన్న తన భర్తకు మహిళల లోదుస్తులను దొంగిలించే అసహ్యకరమైన అలవాటు ఉందని తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇక్కడ దిగ్భ్రాంతికర విషయం ఏంటంటే.. అతడు దొంగిలించేవి ఎవరో గుర్తు తెలియని మహిళల వస్తువులు కాదు.. తమ కుటుంబ సభ్యులు, తన స్నేహితులు ఉపయోగించిన లోదుస్తులను రహస్యంగా దొంగిలిస్తున్నాడని తెలిసి తనను తానే నమ్మలేకపోయింది. ఈ భయంకరమైన వాస్తవం వారికి పెళ్లైన 30 సంవత్సరాల బయటపడింది. ఈ నిజం తెలుసుకున్న క్షణంలోనే ఆ మహిళ మానసికంగా కుంగిపోయింది. విషయం తెలిసిన వెంటనే ఆమె తన భర్తను నేరుగా ప్రశ్నించింది. అతను మొదట్లో తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, చివరికి అతను తన తప్పును అంగీకరించాడు.

తన భర్తకు లోదుస్తుల పట్ల మక్కువ ఉందని తనకు తెలుసునని, కానీ, అతను ఇంత అసహ్యకరమైన పని చేసి తన సొంత వారిని కూడా వదలకుండా వెంటాడుతున్నాడని తాను ఎప్పుడూ ఊహించలేదని భార్య వాపోయింది. ఇలాంటి వింత సమస్యతో బాధపడుతున్న వ్యక్తి భార్య కథను ఒక కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ షేర్‌ చేసింది. ఆమె తన భర్త ప్రవర్తనను పూర్తిగా ద్వేషిస్తోంది.

బాధిత మహిళ ప్రకారం, ఇది కేవలం ఒక వింత అలవాటు కాదు, భావోద్వేగాలతో ఆడుకోవటం, తనకు చేసిన పెద్ద ద్రోహం అంటూ మండిపడింది. తన భర్త తన స్నేహితులు, కుటుంబ సభ్యుల గోప్యతను దెబ్బతీసినందున ఇప్పుడు తాను చాలా చిన్నతనంగా, నిస్సహాయంగా భావిస్తున్నానని ఆమె చెప్పింది. ఇలాంటి పని వారి పవిత్రమైన వైవాహిక బంధాన్ని పూర్తిగా నాశనం చేసిందని, ఇప్పుడు వారి మధ్య గౌరవం మునుపటిలా తిరిగి రాదని ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

వారికి కౌన్సెలింగ్ అందిస్తున్న నిపుణులు కూడా ఆ మహిళ కథను విని ఆశ్చర్యపోయారు. దీనిని తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. ఈ ప్రవర్తన అనైతికమే కాకుండా, బట్టలు దొంగిలించబడిన మహిళల భద్రత, గోప్యతను ఉల్లంఘించడమేనని కౌన్సెలర్ చెప్పారు. ఆ మహిళలు దీని గురించి తెలుసుకుంటే, వారు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో ఊహించడం కూడా కష్టమని నిపుణుడు అన్నారు. ప్రస్తుతం, ఈ బాధిత భార్య తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతుంది. సమాజంలో తన స్నేహితుల ముఖం చూడాలంటే సిగ్గుగా ఉందంటూ విలపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..
మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..
విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..
బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..
బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ
బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ
ఏపీలోని రైతులకు పండుగ చేసుకునే వార్త..
ఏపీలోని రైతులకు పండుగ చేసుకునే వార్త..
బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. చికెన్‌లో ఏది మంచిది..?
బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. చికెన్‌లో ఏది మంచిది..?
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న రోబోట్ డాగ్స్..
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న రోబోట్ డాగ్స్..
తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం