AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ

జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ

Phani CH
|

Updated on: Jan 25, 2026 | 4:46 PM

Share

మార్కాపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి కేసులో బెయిల్‌పై విడుదలైన భర్త లాలశ్రీనును భార్య ఝాన్సీ, బావమరిది అశోక్‌లు దారుణంగా హత్య చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో లాలశ్రీనును అడ్డు తొలగించుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన రోజే కళ్ళలో కారం చల్లి, కత్తులతో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓ కేసులో జైలుకు వెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తీసుకొస్తే.. ఎంత ప్రేమ అనుకుని పొంగిపోయాడు. కానీ అది కపట ప్రేమ అని తెలుసుకోలేకపోయాడు.. తనను అంతమొందించేందుకు సోదరుడితో కలిసి భార్యచేసిన ప్లాన్‌ అని గ్రహించేలోపే ఘాతుకం జరిగిపోయింది. కారంతో..కత్తులతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దారుణంగా ఉసురుతీసి గుర్తుతెలియని వ్యక్తులు చంపేసారని నమ్మించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి సమీపంలో దారుణ హత్య జరిగింది. దోర్నాలకు చెందిన అడపాల లాల శ్రీను అనే వ్యక్తిని అతని భార్య ఝాన్సీ, బావమరిది అశోక్‌లు మరికొందరితో కలిసి కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. దాడికి ముందు లాలశ్రీను కళ్ళల్లో కారం కొట్టారు. మృతుడు లాలశ్రీను ఇటీవల గంజాయి కేసులో జైలుకు వెళ్లి బుధవారం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన రోజే అతడ్ని ఇంటికి తీసుకొస్తూ మార్గమధ్యంలో అంతమొందించారు. లాలశ్రీను గంజాయి కేసులో ఒంగోలు జైలులో ఉన్నాడు. బుధవారం ఉదయం బెయిల్‌పై బయటకు వచ్చిన లాలశ్రీను అతని భార్య జాన్సీ, బావమరిది అశోక్ తో కలిసి దోర్నాలకు బయలుదేరాడు. సాయంత్రం 7గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డుపక్కన ఆగాడు. వెంటనే లాలశ్రీను భార్య జాన్సీ, బావమరిది అశోక్ తమతో తెచ్చుకున్న కారంపొడిని లాలశ్రీనుపై చల్లి కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ హత్యకు మరికొందరు సహకరించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్కాపురం డిఎస్‌పి ఉప్పుటూరి నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో తన మనవళ్ళు అనాధలుగా మారారని హతుడి తల్లి అడపాల సుబ్బమ్మ బోరున విలపించింది. తన కోడలు ఝాన్సీకి సూర్య అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, తన కొడుకును అడ్డు తొలగించుకోడానికి లాలశ్రీనును చంపేసిందని ఆరోపించింది. బెయిల్‌పై తన తండ్రిని తీసుకొచ్చేందుకు తన తల్లి, మేనమామ, మరికొందరితో కలిసి జైలు నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని హతుడి కూతురు చెబుతోంది. రాత్రి అవుతున్నా ఇంకా తన తండ్రి ఇంటికి రాకపోవడంతో తల్లికి ఫోన్‌ చేస్తే ఎవరో తన తండ్రిని హత్య చేసిపారిపోయారని తెలిపిందని మృతుడి కూతురు తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్టు చిత్రీకరిస్తున్నారని, ఈ దారుణానికి పాల్పడిన వారు తనను, తన మనవళ్ళను కూడా చంపేస్తారని భయంగా ఉందని , తమ కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని మృతుడి తల్లి సుబ్బమ్మ వేడుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..

Amaravati: రాజధాని అమరావతిలో.. అంగరంగ వైభవంగా తొలిసారి రిపబ్లిక్ వేడుకలు

ఈ చలాన్ల పేరుతో సైబర్‌ వల.. లక్షలు కోల్పోతున్న సామాన్యులు

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ

800 మంది ఉరిశిక్షలను నేనే ఆపాను.. లేకపోతే..