ఈ చలాన్ల పేరుతో సైబర్ వల.. లక్షలు కోల్పోతున్న సామాన్యులు
సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ-చలాన్ల పేరుతో వాహనదారులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు పంపినట్టుగా కనిపించే ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తక్షణమే చలాన్ చెల్లించకపోతే జరిమానా పెరుగుతుందని భయపెట్టి లక్షలు దోచుకుంటున్నారు. అస్సలు ఈ లింక్‌లను క్లిక్ చేయవద్దని, అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చెల్లింపులు చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయాలి.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త అవతారం ఎత్తారు. నకిలీ ఈ చలాన్లతో వాహనదారులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అచ్చం ట్రాఫిక్ పోలీసులు పంపినట్టే కనిపించే ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపిస్తూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తక్షణమే చలాన్ చెల్లించకపోతే జరిమానా పెరుగుతుందని భయపెట్టి సామాన్యులను నిండా దోచుకుంటున్నారు. అసలు ఈ నకిలీ ఈ–చలాన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? వీటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి? ట్రాఫిక్ ఈ–చలాన్ల పేరుతో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు వాహనదారులకు “మీ వాహనంపై చలాన్ పెండింగ్‌లో ఉంది” అంటూ అధికారికంగా కనిపించే ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారు. అందులో ఉన్న ఫేక్ లింక్‌ను క్లిక్ చేస్తే, ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ పేజీలు ఓపెన్ అవుతున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ నంబర్, చెల్లింపు వివరాలు నమోదు చేయగానే బ్యాంకింగ్ సమాచారం హ్యాక్ అవుతూ ఖాతాలు ఖాళీ అవుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒక వ్యక్తి రూ.500 చలాన్ చెల్లించేందుకు లింక్ ఓపెన్ చేయగా ఏకంగా రూ.6 లక్షలు కోల్పోయాడు. మియాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.48 వేలు, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారి ఈ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి తీవ్రంగా నష్టపోయారు. కూకట్‌పల్లిలో ఓ మహిళ OTP ఇచ్చి రూ.1.2 లక్షలు పోగొట్టుకుంది. ఇవన్నీ ఒకే సైబర్ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ ద్వారా వచ్చిన ఈ–చలాన్ లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. చలాన్ చెల్లింపులు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే చేయాలని, OTP, UPI పిన్, కార్డు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. మోసానికి గురైతే వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి, బ్యాంకును సంప్రదించి 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే
రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం
TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

