AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. చూశారంటే మీ పొట్ట చెక్కలే..

పెళ్లిలో వధువు రసగుల్లాను పట్టుకున్న వైరల్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బంధువులు స్వీట్ తినిపించే సమయంలో జారి పడుతున్న రసగుల్లాను వధువు మెరుపు వేగంతో అందుకుంది. ఆమె క్యాచ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫన్నీ మూమెంట్‌ను నెటిజన్లు ఎంఎస్ ధోనీ క్యాచ్‌తో పోలుస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియో అందరినీ నవ్విస్తోంది.

పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. చూశారంటే మీ పొట్ట చెక్కలే..
Rasgulla Catch By Bride
Jyothi Gadda
|

Updated on: Jan 24, 2026 | 2:23 PM

Share

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించి చాలా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో వధూవరులకు సంబంధించి, బంధుమిత్రులు చేసే అల్లరి చేష్టలు తరచూగా మానం చూస్తూనే ఉంటాం.. అయితే, ఒక్కోసారి వధువు, లేదంటే వరుడు చేసే వింత వింత పనులు కూడా నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. ఇది కూడా అలాంటిదే.. ఇక్కడ వధువు చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వావ్‌ ఏం క్యాచ్‌ అది అంటూ ఆమెను సరదా ప్రశంసలతో ముంచేస్తున్నారు.

సాదారణంగా పెళ్లిలో వధువు సిగ్గుపడటం చూస్తుంటాం. కానీ, మీరెప్పుడైనా కరెక్ట్‌ క్యాచ్‌ పట్టుకున్న పెళ్లి కూతురిని చూశారా..? పెళ్లి కూతురు ఏంటీ..? క్యాచ్‌ పట్టడం ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఒక పెళ్లిలో ఒక వధువు రసగుల్లాను పట్టుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం. వధువు క్యాచ్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

వివాహ ఆచారాలలో స్వీట్లు తినడం ఒక సాధారణ విషయమే. అయితే, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో బంధువులు వధూవరులకు రస్‌గుల్లా తినిపిస్తున్నారు. ఇప్పుడు వరుడి వంతు వచ్చింది. కానీ, మిఠాయి తినిపిస్తున్న మహిళ చేతిలోంచి ఆ రస్‌గుల్లా జారి కిందపడింది..కానీ, పక్కనే ఉన్న వధువు.. మెరుపు వేగంతో దాన్ని చేజారకుండా పట్టేసుకుంది..జ్యూసీగా చూస్తేనే నోరూరిపోయేలా కనిపిస్తున్న రస్‌గుల్ల కిందపడిందేమోనని ఆ మహిళ కంగారుగా చూసే సరికి అది పెళ్లి కూతురి చేతిలో పడటం కనిపిస్తుంది. ఆమె క్యాచ్‌ని భలేగా పట్టింది..దాంతో ఈ వివాహ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. అందుకే అందరూ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తున్నారు. కొన్ని సెకన్లు మాత్రమే నిడివి కలిగిన ఈ వీడియోని చాలా మంది నెటిజన్లు వధువు క్యాచ్‌ను క్రికెటర్లతో, ముఖ్యంగా ఎంఎస్ ధోని క్యాచింగ్ శైలితో పోలుస్తున్నారు. ఈ వీడియోకు రకరకాల ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పార్ట్‌నర్ అనే ఒక్క పదంతో మాయాజాలం.. డెలివరీ బాయ్స్ జీవితాల..
పార్ట్‌నర్ అనే ఒక్క పదంతో మాయాజాలం.. డెలివరీ బాయ్స్ జీవితాల..
రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది?
రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది?
క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్
క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్
పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి
పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి
ఓటీటీలో అనుపమ కొత్త సినిమా.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఓటీటీలో అనుపమ కొత్త సినిమా.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
చలికాలంలో వచ్చే రోగాలన్నింటినీ తరిమికొట్టే కమ్మనైన ఉసిరికాయ రసం
చలికాలంలో వచ్చే రోగాలన్నింటినీ తరిమికొట్టే కమ్మనైన ఉసిరికాయ రసం
కప్పు రవ్వతో.. పిల్లలు మళ్లీ మళ్లీ చేయమని అడిగే జ్యూసీ డెజర్ట్
కప్పు రవ్వతో.. పిల్లలు మళ్లీ మళ్లీ చేయమని అడిగే జ్యూసీ డెజర్ట్
మా మధ్యలో ఎవ్వరూ రాలేదు.. కానీ విడిపోయాం
మా మధ్యలో ఎవ్వరూ రాలేదు.. కానీ విడిపోయాం
Video: 6,6,6,6,4,4.. 38 ఏళ్ల వయసులో ఈ దూకుడేంది సామీ..!
Video: 6,6,6,6,4,4.. 38 ఏళ్ల వయసులో ఈ దూకుడేంది సామీ..!
శరీరానికి బలాన్నిచ్చే వట్టి తునకల కూర.. లాభాలు తెలిస్తే వదలరు
శరీరానికి బలాన్నిచ్చే వట్టి తునకల కూర.. లాభాలు తెలిస్తే వదలరు