లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !! ఆమెతోనే కలిసి వచ్చి..మాయమైన కిలాడీ దొంగ
భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రి లిఫ్ట్‌లో ఒక మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కుని ముసుగు దొంగ పారిపోయాడు. బాధితురాలితో పాటే లిఫ్ట్‌లో వచ్చిన దొంగ, లిఫ్ట్ ఓపెన్ కాగానే చోరీకి పాల్పడ్డాడు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బంగారం ధరలు అడ్డగోలుగా పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి.
బంగారం ధరలు అడ్డగోలుగా పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన భద్రతా లోపాలను ఎత్తి చూపింది. భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఒక మహిళ లిఫ్ట్ దిగుతూ ఉండగా, ఒక ముసుగు దొంగ ఆమె మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కుని పారిపోయాడు. ఈ సంఘటన రోడ్డుపైన కాకుండా, అత్యంత రద్దీగా ఉండే ఆసుపత్రి ప్రాంగణంలో, అదీ లిఫ్ట్ లోపల జరగడం ఆందోళన కలిగిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, నిందితుడు బాధితురాలితో పాటే లిఫ్ట్‌లో కిందకు వచ్చాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే, క్షణాల్లో ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరుగు తీశాడు. బాధితురాలు గట్టిగా అరిచినప్పటికీ, దొంగ ఎవరికీ చిక్కకుండా తప్పించుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీ బ్రాండ్లు ఇక మన లోకల్ మార్కెట్ ధరలకే
Kethireddy Venkatarami Reddy: ఎన్ని కేసులు పెడితే అంత ఉత్సాహంతో పోరాటం చేస్తాం
ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే మూగబోయాను.. కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

