AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: ఓ వైపు చదువుకుంటూనే.. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న ఓ స్టూడెంట్.. మీ చిరునవ్వు, విశ్వాసం మాకు నచ్చిందంటున్న నెటిజన్లు

ఈ విద్యార్థి ఇంట్లో తయారు చేసిన భారతీయ రుచికరమైన వంటకాలను చెక్క బల్లలపై విక్రయిస్తాడు. ముఖ్యంగా ఆకట్టుకునే విషయమేమిటంటే.. ఈ యువకుడు స్వయంగా వంటలను తయారు చేస్తాడు. యువకుడు ప్రేరణాత్మక కథ వీడియోను ఫుడ్ బ్లాగర్ విశాల్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్వ్యూ ని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Inspiring Story: ఓ వైపు చదువుకుంటూనే.. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న ఓ స్టూడెంట్.. మీ చిరునవ్వు, విశ్వాసం మాకు నచ్చిందంటున్న నెటిజన్లు
Viral Video
Surya Kala
|

Updated on: Apr 08, 2023 | 2:52 PM

Share

కొందరు ఉద్యోగం అంటే ఎండ తగలకుండా.. ఏసీ కింద కూర్చుని చేయాలనీ భావిస్తారు. మరొకొందరు.. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని విశ్వసిస్తారు. అయితే ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు తనకు తాను ఉపాధి కల్పించుకుని యువత మన దేశంలో అరుదు.. అతి తక్కువ మంది మాత్రమే ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు ఉద్యోగం చేస్తూ తమని తాము పోషించుకుంటారు.. లేదా తమ కుంటుంబానికి అండగా నిలబడతారు.. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక స్టూడెంట్ పది మందికి స్ఫూర్తివంతంగా నిలుస్తాడు.

స్ట్రీట్ ఫుడ్ స్టాండ్‌లు మన దేశమంతా కనిపిస్తాయి. నగరంలో మాత్రమే కాదు.. చిన్న చిన్న పల్లెల్లో కూడా రుచికరమైన ఆహారాన్ని అందించే స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ అనేకం ఉన్నాయి. వృద్ధులు, యువకులు, మహిళలు ఇలా అనేకమంది ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ లతో జీవనోపాధిని పొందుతారు. కొన్ని కథలు ఇంటర్నెట్ లో వెలుగులోకి వచ్చి.. పలువురికి ఇన్స్పైరింగ్ గా నిలుస్తాయి. ఇప్పుడు ఒక విద్యార్థి ఇంట్లో తాను ఆహారాన్ని వండి.. వాటిని ఒక వీధిలో అమ్ముతున్న కథ నెటిజన్ల హృదయాలను తాకింది.

ఇవి కూడా చదవండి

ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీలో స్ట్రీట్ ఫుడ్ స్టాండ్ ఉన్న ఈ కుర్రాడిది ఒక స్టోరీ ఉంది. ఈ విద్యార్థి ఇంట్లో తయారు చేసిన భారతీయ రుచికరమైన వంటకాలను చెక్క బల్లలపై విక్రయిస్తాడు. ముఖ్యంగా ఆకట్టుకునే విషయమేమిటంటే.. ఈ యువకుడు స్వయంగా వంటలను తయారు చేస్తాడు. యువకుడు ప్రేరణాత్మక కథ వీడియోను ఫుడ్ బ్లాగర్ విశాల్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్వ్యూ ని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

యువకుడు తనకు దొరికే ఖాళీ సమయంలో ఫరీదాబాద్ పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీలో రోడ్డు పక్కన టేబుల్ వేసుకుని ఓ నాలుగు రకాల కూరలను పెట్టుకుని అమ్ముతున్నాడు. అప్పుడు ఫుడ్ బ్లాగర్ విశాల్ శర్మ కి తాను వంట చేసిన ఆహార పదార్ధాలను పరిచయం చేశాడు. కాధీ, అన్నం, రాజ్మా, దాల్, రోటి, పన్నీర్ అమ్ముతున్నట్లు చెప్పాడు. తాను తన ఇంటి వద్ద స్వయంగా వండుకుని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. అలాగే వాటి ధరలు కూడా చెప్పాడు.

View this post on Instagram

A post shared by vishal sharma (@foodyvishal)

ఈ వీడియో షేర్ చేసిన తర్వాత 1.5 లక్షలకు పైగా వ్యూస్ ను, దాదాపు 4,500 లైక్‌లు, అనేక కామెంట్స్ ను సొంతం చేసుకుంది. “ఇది చాలా అద్భుతంగా ఉంది.. మీ జీవితంలో అత్యుత్తమ నిర్ణయం.. నువ్వు భారతదేశానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్త కావాలని తాము కోరుకుంటున్నాము” అని ఒకరు కామెంట్ చేశారు. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది” అని మరొకరు, . “నేను మీ కోసం ప్రార్థిస్తాను.” మరికొందరు హార్ట్ ఎమోజీలతో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..