Viral photo: ‘బండి చిన్నదే కావొచ్చు.. ప్రాణం పెద్దది బ్రదర్’.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో
జీవితం చాలా విలువైనది. ఎన్నో ఆశలు.. అంతకుమించిన బాధ్యతలు. అంత విలువైన ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోతే. ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది.
జీవితం చాలా విలువైనది. ఎన్నో ఆశలు.. అంతకుమించిన బాధ్యతలు. అంత విలువైన ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోతే. ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఏదైనా వ్యాధి ఉన్నవారు.. క్రమేణ ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడతారు. కానీ రోడ్డు ప్రమాదాల వల్ల మనుషులు అకస్మాత్తుగా దూరమవుతారు. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునవారు (పిలియన్ రైడర్) కూడా హెల్మెట్ ధరించాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా తలకు దెబ్బలు తగలడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎంత చెప్పినా మాట వినకపోతే.. ఫైన్స్ మోత మోగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఈ మధ్యకాలంలో హెల్మెట్ వినియోగం బాగా పెరిగింది. అయితే తాజాగా ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో మోపెడ్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మహిళ కూడా హెల్మెట్ ధరించారు. ఎగ్జాట్‌గా మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఫోటో క్లిక్ చేశారు. ఈ మోపెడ్‌పై వెళ్తున్నవారిని ప్రజంట్ జనరేషన్ యువత ఆదర్శంగా తీసుకోవాలి. పెద్ద, పెద్ద స్పోర్ట్స్ బైక్స్ నడుపుతూ కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదు. ఈ ఫోటోలోని వ్యక్తి మోపెడ్ నడుపుతూ కూడా తనతో పాటు పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించేలా జాగ్రత్త తీసుకున్నాడు. ‘బండి చిన్నదే కావొచ్చు.. ప్రాణం పెద్దది బ్రదర్’. మీరేమంటారు.
కాగా ఈ ఫోటో ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడినట్లు లేదు.. లేదంటే ఈ పాటికే ట్విట్టర్ వేదికగా హెల్మెట్ ప్రాధాన్యతను తెలిపేందుకు వినియోగించేవారు.
Also Read: అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి అనుకోని అతిథి.. ఆ పాప కానీ ఏడవకపోయి ఉంటే
Tollywood Heroine: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి… ఇలా మాయమైంది