Weird News: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ.. దాని రుచి అలా ఉందంటూ.. షాకింగ్ విషయాలు
Woman Loves to drink her Urine: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింత సంఘటనలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తుంటాయి. వింత పదార్థాలను తినడానికి అలావాటుపడిన చాలాంమందిని మనం
Woman Loves to drink her Urine: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింత సంఘటనలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తుంటాయి. వింత పదార్థాలను తినడానికి అలావాటుపడిన చాలాంమందిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే.. తాజాగా ఎన్నడూ వినని, కనని వింత సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ విషయం తెలిసుకున్న ప్రతిఒక్కరు ఎవరైనా ఇలా చేస్తారా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కొలరాడో నుంచి వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలోని క్యారీ అనే మహిళ తన మూత్రం తానే తాగేస్తోంది. ఆమెకు మూత్రం తాగనిదే నిద్రపట్టదంటూ పేర్కొంటోంది. ఇది వింతగా, అసహ్యంగా అనిపించినా ఇది మాత్ర కచ్చితంగా నమ్మాల్సిందే. గత 4 సంవత్సరాలుగా క్యారీ.. తన మూత్రాన్ని తాగుతోంది. అయితే క్యారీకి ఈ వింత అలావాటు ఎలా వచ్చిందో ఇప్పడు తెలుసుకుందాం..
ప్రజలు ఆహారం, పానీయాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఇష్టమైన ఆహారాన్ని, పానీయాలను మాత్రమే తీసుకుంటుంటారు. కానీ ఎవరైనా తన మూత్రం తానే తాగడానికి ఇష్టపడతారని.. మీరు ఎప్పుడూ కూడా విని ఉండరు. కొలరాడోకు చెందిన 53 ఏళ్ల క్యారీ తన మూత్రాన్ని తానే తాగడానికి ఇష్టపడుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మాత్రమే కాదు.. ఆమె గత నాలుగేళ్లుగా ఇలా చేస్తోందని పేర్కొంటున్నారు. అయితే.. నీరు తాగడానికి బదులుగా.. ఆమె తన మూత్రాన్ని నిల్వ ఉంచి మరి తాగుతున్నట్లు క్యారీ వెల్లడించింది. క్యారీకి ఉన్న ఈ వింత వ్యసనం గురించి తెలిసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు. ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. క్యారీ రోజులో కనీసం 5 గ్లాసుల మూత్రం తాగుతుందట. ఇలాంటి పరిస్థితిలో.. ఆమె మూత్రం తాగడాన్ని అంచనా వేస్తే.. ఆమె గత 4 సంవత్సరాలలో 3400 లీటర్ల కంటే ఎక్కువ మూత్రం తాగినట్లు నివేదిక వెల్లడించింది.
టీఎల్‌సీకి చెందిన ‘మై స్ట్రేంజ్ అడిక్షన్’ అనే కార్యక్రమంలో క్యారీ ఈ విషయాన్ని వెల్లడించింది. మూత్రం తాగడం వల్ల తనకు చాలా ఉపశమనం లభిస్తుందని చెప్పింది. తాను ఏది తిన్నా.. దాని రుచి తన మూత్రంలా ఉండదని క్యారీ చెప్పింది. అంతేకాకుండా మూత్రం రుచి ప్రతిసారీ భిన్నంగా ఉంటుందని పేర్కొంది. కొన్నిసార్లు తన మూత్రం షాంపైన్ వంటి రుచిని కలిగిఉంటుందని.. చెప్పి క్యారీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నివేదిక ప్రకారం.. మెలనోమా క్యాన్సర్ చికిత్స సమయంలో కేరీ మొదట తన మూత్రాన్ని తాగడం ప్రారంభించింది. ఇది పురాతన వైద్యం పద్ధతి. దీంతో తనకు ఎంతో మేలు జరిగిందని కేరీ చెప్పింది. అయితే ఇప్పుడు అది వ్యసనంగా మారిందని నివేదిక వెల్లడించింది.
ఇందుకోసం.. క్యారీ తన మూత్రాన్ని నిల్వ ఉంచుకోని మరి తాగుతున్నట్లు చెప్పింది. అయితే.. యూరిన్‌ను తాగడంతో ఆమె జుట్టుకు కూడా పూస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా.. కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలను తొలగించడానికి కూడా తన మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు క్యారీ సంచలన విషయాలను వెల్లడించింది. తాను మరణించే వరకు మూత్రం తాగడం ఆపనంటూ క్యారీ షోలో తేల్చి చెప్పడం గమనార్హం.
Also Read: