AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial Food Color: అందంగా, ఆకర్షణీయంగా ఉందని రంగులు కలిపిన ఆహారం తినేస్తున్నారా.. మీ ఆయుస్సు తగ్గుతుందని తెలుసా..

ఫుడ్ కలర్స్ సహాయంతో తయారు చేసిన డిష్ ఖచ్చితంగా అందంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇది ఆహారంలోని పోషక విలువలను తగ్గిస్తుంది. ప్రస్తుతం బయట దొరికే చాలా ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా మార్చేందుకు కృత్రిమ ఆహార రంగులు వాడుతున్నారు. అయితే అందంగా కనిపించే ఈ రంగులు స్లో పాయిజన్‌గా పనిచేస్తాయని మీకు తెలుసా. కృత్రిమ ఆహార రంగులు మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..

Artificial Food Color: అందంగా, ఆకర్షణీయంగా ఉందని రంగులు కలిపిన ఆహారం తినేస్తున్నారా.. మీ ఆయుస్సు తగ్గుతుందని తెలుసా..
Artificia Food Color
Surya Kala
|

Updated on: Jun 29, 2024 | 1:20 PM

Share

తినే ఆహరం అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువగా కృతిమ ఫుడ్ కలర్స్ ని ఉపయోగిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన ఈ కృత్రిమ ఆహార రంగులను పెళ్ళిళ్ళు, ఫంక్షన్లతో పాటు స్ట్రీట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఆహారానికి అద్భుతమైన రుచి లభిస్తుంది. అదే సమయంలో ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా హానిని కలిగిస్తాయి కూడా.. అయితే ఆహారం ఆకర్షణీయమైన రంగుతో కనిపిస్తూ కనుల విందు చేయడంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ఫుడ్స్ అంటే అత్యంత ఇష్టంగా తింటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఇటువంటి ఆహార రంగు, రుచిని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దీంతో ఎక్కువ హోటళ్లలో కృత్రిమ ఆహార రంగును విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. ఈ ఫుడ్ కలర్స్ సహాయంతో తయారు చేసిన డిష్ ఖచ్చితంగా అందంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇది ఆహారంలోని పోషక విలువలను తగ్గిస్తుంది. ప్రస్తుతం బయట దొరికే చాలా ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా మార్చేందుకు కృత్రిమ ఆహార రంగులు వాడుతున్నారు. అయితే అందంగా కనిపించే ఈ రంగులు స్లో పాయిజన్‌గా పనిచేస్తాయని మీకు తెలుసా. కృత్రిమ ఆహార రంగులు మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..

చర్మం, జుట్టుకు నష్టం: కృత్రిమ ఆహార రంగులతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల జుట్టు, చర్మానికి చాలా హాని కలుగుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం టార్ట్రాజైన్ అని పిలువబడే పసుపు ఆహార రంగుల వాడకం ఆస్తమా, దద్దుర్లు వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది: కార్సినోజెన్ అని పిలువబడే కృత్రిమ ఆహార రంగులను ఉపయోగించే ఆహారంలో బెంజీన్ కనుగొనబడింది. ఇది కాకుండా ఇతర ఆహార రంగులలో అనేక రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని అధికం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

అలెర్జీ రిస్క్ పెరుగుతుంది: కృత్రిమ ఆహార రంగుల వల్ల కూడా అలర్జీ సమస్యలు వస్తాయి. అదే సమయంలో గర్భిణీ స్త్రీలు కృత్రిమ ఆహార రంగులతో కూడిన వాటిని తినడం అనారోగ్యానికి కారణం. కనుక ఈ సమయంలో , ఏదైనా విదేశీ వస్తువులు, ఫాస్ట్ ఫుడ్ ని తినే ముందు దయచేసి వైద్యుడిని సంప్రదించండి.

ఎలాంటి ఆహారం సురక్షితం అంటే : మార్కెట్లో లభించే కృత్రిమ ఆహార రంగులు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. దీనికి బదులుగా సహజ ఆహార రంగును ఉపయోగించాలి. ఇందులో పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం బీట్‌రూట్ , ఆకుపచ్చ రంగు కోసం కొత్తిమీర వంటి వాటిని ఉపయోగించాలి. వీటిని ఉపయోగించడం వల్ల ఆహారంలో పోషక విలువలు కూడా పెరుగుతాయి , ఈ ఆహార పదార్థాలు రుచిలో కూడా మెరుగవుతాయి. దీంతో పాటు ఈ ఆహార పదార్థాలను ఇంట్లోని పిల్లలకు తినడానికి కూడా ఇవ్వొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..