AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. హోంమంత్రి అనిత సమీక్ష

ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. హోంమంత్రి అనిత సమీక్ష
Rainy Season
Surya Kala
|

Updated on: Jun 29, 2024 | 6:47 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.  హోం మంత్రి అనిత ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పరిశీలన చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరిజిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరుజిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడూ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..