వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

ఏపీలో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా రెండు ఆఫీస్‌లకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైసీపీ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో.. గత పిటిషన్లకు అటాచ్‌ చేసి తీర్పు రిజర్వ్‌ చేసింది ఏపీ హైకోర్టు. వైసీపీ కార్యాలయాలకు నోటీసుల వ్యవహారం ఏపీలో కాక రేపుతోంది.

వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
Ap High Court
Follow us
Srikar T

|

Updated on: Jun 28, 2024 | 9:50 PM

ఏపీలో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా రెండు ఆఫీస్‌లకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైసీపీ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో.. గత పిటిషన్లకు అటాచ్‌ చేసి తీర్పు రిజర్వ్‌ చేసింది ఏపీ హైకోర్టు. వైసీపీ కార్యాలయాలకు నోటీసుల వ్యవహారం ఏపీలో కాక రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాలు అక్రమమని ఆరోపిస్తూ అధికారులు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. తాజాగా.. ఉండి, పల్నాడు పార్టీ కార్యాలయాలకు కూడా నోటీసులు ఇవ్వడంతో హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. రెండు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. గత పిటిషన్లకు ట్యాగ్‌ చేసి తీర్పు రిజర్వ్ చేసింది. అయితే.. తాజా పిటిషన్లపైనా స్టేటస్‌కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే.. అధికారుల నోటీసులపై వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో సుమారు 16 ఆఫీసులపై స్టేటస్‌ కో ఇవ్వడంతోపాటు తీర్పు రిజర్వు చేసింది. అక్రమంగా నిర్మించారని, నిబంధనలు పాటించకపోవడంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోయాయని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆఫీసులు కూల్చివేశారు. ఆయా పరిణామాలపై వైసీపీ.. హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది. అయితే.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 వైసీపీ కార్యాలయాల నోటీసులపై స్టేటస్‌కో ఇచ్చింది. ఇదిలావుంటే.. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను రాజకీయ కక్ష్యతో కూల్చివేస్తున్నారని వైసీపీ తరఫు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అటు.. ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌.. ప్రస్తుతం నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని మాత్రమే అధికారులు నోటీసులు ఇచ్చారని.. సమాధానం ఇస్తే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ.. ఫైనల్‌ డెసిషన్‌పై అభ్యంతరం ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలన్నారు. తొలి నోటీసులతోనే దాఖలు చేసిన వైసీపీ పిటిషన్లకు విచారణ అర్హత లేదన్నారు ఏజీ దమ్మాలపాటి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు రిజర్వ్‌ చేయడం ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!