ఈ యాత్ర పొడవునా అనేక సవాళ్లు, ప్రకృతి పెట్టే పరీక్షలు.. అయినా అమర్నాథ్ యాత్రను ఎందుకు చేస్తారో తెలుసా..

శ్రావణ మాసంలో అమర్‌నాథ్ యాత్ర ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉంది. పవిత్ర అమర్‌నాథ్ గుహ జమ్మూ, కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ పర్వతంపై ఉంది. ఈ గుహలో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని బాబా బర్ఫానీ అని పిలుస్తారు. అమర్‌నాథ్ యాత్ర ఆషాడ మాసం పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. శ్రావణ పూర్ణిమ వరకు కొనసాగుతుంది. చంద్రుని కాంతిని బట్టి శివ లింగ పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఇలా ఏర్పడే శివలింగం ప్రపంచంలోని ఇదొక్కటే. ఈ కాలంలో లక్షలాది మంది శివభక్తులు బాబా ఆస్థానానికి దర్శనం కోసం వస్తారు.

ఈ యాత్ర పొడవునా అనేక సవాళ్లు, ప్రకృతి పెట్టే పరీక్షలు.. అయినా అమర్నాథ్ యాత్రను ఎందుకు చేస్తారో తెలుసా..
Amarnath Yatra 2024
Follow us

|

Updated on: Jun 29, 2024 | 7:21 AM

అమర్‌నాథ్ తీర్థయాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. అమర్‌నాథ్‌లోని పవిత్ర గుహలో శివుడు మంచు లింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. పవిత్ర అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీ దర్శనం కోసం శివ భక్తులు అమర్‌నాథ్ యాత్రకు ఏడాది పొడవునా ఆసక్తిగా వేచి ఉంటారు. మంచు నుండి శివలింగం ఏర్పడినందున దీనిని ‘బాబా బర్ఫానీ’ అని కూడా పిలుస్తారు. అమర్‌నాథ్ యాత్ర చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. ఈ యాత్ర సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వర్షాలు, కొన్నిసార్లు చల్లని వాతావరణం భక్తులను అడుగడుగునా పరీక్షిస్తుంది. అయితే ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా.. ప్రకృతి భక్తులను పరీక్షించినా భక్తులు బాబా బర్ఫాని దర్శనం కోసం పూర్తి ఉత్సాహంతో ఎదురు చూస్తారు.

శ్రావణ మాసంలో అమర్‌నాథ్ యాత్ర ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉంది. పవిత్ర అమర్‌నాథ్ గుహ జమ్మూ, కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ పర్వతంపై ఉంది. ఈ గుహలో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని బాబా బర్ఫానీ అని పిలుస్తారు. అమర్‌నాథ్ యాత్ర ఆషాడ మాసం పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. శ్రావణ పూర్ణిమ వరకు కొనసాగుతుంది. చంద్రుని కాంతిని బట్టి శివ లింగ పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఇలా ఏర్పడే శివలింగం ప్రపంచంలోని ఇదొక్కటే. ఈ కాలంలో లక్షలాది మంది శివభక్తులు బాబా ఆస్థానానికి దర్శనం కోసం వస్తారు.

అమర్‌నాథ్ గుహ శివుని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అమర్‌నాథ్ గుహలో ప్రతి సంవత్సరం సహజంగా ఏర్పడే శివలింగం అరుదైనదిగా పరిగణించబడుతుంది. గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారుతున్న నీటి బిందువులు మంచు శివలింగం రూపాన్ని సంతరించుకుంటాయి. విపరీతమైన చలి కారణంగా నీరు ఘనీభవించిన మంచు శివలింగం ఆకారాన్ని సంతరించుకుంటుంది. అయితే అమర్‌నాథ్ పవిత్ర గుహలో మంచు శివలింగం ఎప్పుడు కనిపించిందనే దానికి వ్రాతపూర్వక ఆధారాలు లేవు. అయితే ఈ గుహ సుమారు 150 సంవత్సరాల క్రితం తిరిగి కనుగొనబడిందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

అమర్‌నాథ్ ఆలయ యాత్ర ఆషాఢ మాసం పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై శ్రావణ పౌర్ణమి రోజు వరకు కొనసాగుతుంది.. అంటే రాఖీ పండగ వరకో కొనసాగుతుంది. 2024 సంవత్సరంలో, అమర్‌నాథ్ యాత్ర 29 జూన్ 2024 నుంచి ప్రారంభమవుతుంది.. ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర చేయాలనుకునే భక్తుల కోసం జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రారంభమైంది. హిందువుల పవిత్ర మాసం జూలై-ఆగస్టులో సాధారణంగా అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది

భక్తులు అమర్‌నాథ్ యాత్రకు ఎందుకు వెళతారు? (అమర్‌నాథ్ యాత్ర ప్రాముఖ్యత)

హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతి దేవికి అమరత్వ రహస్యం గురించి చెప్పిన పవిత్ర గుహ ఇది. ఈ పవిత్ర గుహలో నిర్మించిన మంచు శివలింగాన్ని అంటే బాబా బర్ఫానీని దర్శించిన భక్తుడు అతని పాపాలన్నీ నశించి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని పురాణ గ్రంథాల ప్రకారం నమ్మకం. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని కూడా చెబుతారు.

హిందూ పురాణాల ప్రకారం అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీని దర్శించడం వల్ల కాశీలో శివ లింగాన్ని దర్శించడం కంటే 10 రెట్లు, ప్రయాగ కంటే 100 రెట్లు ఎక్కువ, నైమిశారణ్య తీర్థం కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అమర్‌నాథ్ యాత్రను చేసిన వ్యక్తి శివయ్య ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు. అందుకే ఎంత కష్టమైనా సరే శివభక్తులు ఈ యాత్రను పూర్తి భక్తితో పూర్తి చేసి బాబా బర్ఫానీ దర్శన భాగ్యం పొందుతారు.

బాబా బర్ఫానీ ఎలా కనిపిస్తాడు?

పవిత్రమైన అమర్‌నాథ్ గుహలో వెలిసిన బాబా బర్ఫానీని శివుని చిహ్నంగా భావిస్తారు. అమర్‌నాథ్ గుహలో చిన్న శివలింగం ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఇది వరుసగా 15 రోజులు ప్రతిరోజూ నెమ్మదిగా పెరుగుతుంది. 15 రోజుల్లో ఈ మంచు శివలింగం ఎత్తు 2 గజాల కంటే ఎక్కువ పెరుగుతుంది. చంద్రుడు క్షీణించడంతో శివలింగం పరిమాణం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. చంద్రుడు అదృశ్యమైన వెంటనే శివలింగం కూడా అదృశ్యమవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..