మావూళ్ళమ్మకు జేష్ఠమాసంలో జాతర.. ఆశాఢంలో ప్రత్యేక అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు..
భీమవరం మావుళ్ళమ్మకు నెల రోజులపాటు వైభవంగా జేష్ఠ మాస జాతర ప్రతియేటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావుళ్ళమ్మను కొలవటం ఆనవాయితీగా వస్తోంది. నిత్యం ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ అమ్మవారికి జ్యేష్ఠ మాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
భీమవరం మావుళ్ళమ్మకు నెల రోజులపాటు వైభవంగా జేష్ఠ మాస జాతర ప్రతియేటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావుళ్ళమ్మను కొలవటం ఆనవాయితీగా వస్తోంది. నిత్యం ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ అమ్మవారికి జ్యేష్ఠ మాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మావుళ్ళమ్మ అమ్మవారికి రెండుసార్లు ఘనంగా ఉత్సవాలు జరిపిస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజు నుండి నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరొకసారి జేష్ఠ మాసం నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసం పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. దసరా 10 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. జ్యేష్ఠ మాసంలో మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరంలో సంచరిస్తారని భక్తల విశ్వాసం. అందుకే జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. సారె సమర్పిస్తారు.
ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు వస్తుంటారు. మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర మహోత్సవాలు దేవస్థానంతోపాటూ నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారి జేష్ఠ మాసం జాతర ఘనంగా జరిపారు. దేవస్థాన ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జునశర్మ అధ్వర్యంలో అర్చక బృందం మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించి సాంప్రదాయానుసరం ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పూల రధంపై ఉంచారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు కొబ్బరికాయ కొట్టి అమ్మవారి నగరోత్సవము ప్రారంభించారు. జాతర మహోత్సవము నిర్వహణ నిమిత్తం రెండు లక్ష రూపాయిలు ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటికి అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..