కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఫీట్ పిక్స్‌తో లక్షల్లో సంపాదన! ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా?
నేటి డిజిటల్ యుగంలో డబ్బు సంపాదించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. అయితే కేవలం మీ కాళ్ల ఫోటోలు అమ్మి నెలకు లక్షల్లో సంపాదించొచ్చు అంటే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా, విదేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ 'ఫీట్ పిక్' బిజినెస్ ఇప్పుడు భారత్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి? ఇందులో ఉన్న రిస్క్ ఏంటి? మన దేశ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం పదండి.

ప్రపంచవ్యాప్తంగా ఫీట్ ఫెటిష్ ఉన్నవారు కోట్లలో ఉన్నారు. తమకు నచ్చిన విధంగా ఉన్న కాళ్ల ఫోటోలు లేదా వీడియోల కోసం వీరు భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు. కేవలం ఫోటోలే కాకుండా.. వాడిన సాక్స్ వంటి వాటికి కూడా డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా FeetFinder, FunWithFeet వంటి వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఇలా ఫోటోలు అమ్మడం ఇండియాలో నేరమా? అని. దీనిపై నిపుణులు ఏమంటున్నారనే విషయాన్ని చూసుకుంటే.
నిపుణులు ప్రకారం.. భారతీయ చట్టాల్లో కాళ్ల ఫోటోలు అమ్మడాన్ని నేరంగా పరిగణించే ప్రత్యేక సెక్షన్లు ఏవీ లేవు. ఇది ఒక రకమైన మోడలింగ్ లేదా కంటెంట్ క్రియేషన్ కిందకు వస్తుంది. ఒకవేళ ఆ ఫోటోలు అశ్లీలతను ప్రేరేపించేలా ఉంటే మాత్రం IT యాక్ట్ 2000లోని సెక్షన్ 67 కింద చిక్కులు తప్పవు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఫోటోలు పెట్టినప్పుడు, మీ వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.
బిజినెస్‌లోకి దిగే ముందు ఇవి తెలుసుకోండి.
ఒకవేళ ఎవరైనా ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటే తగు జాగ్రత్తలు పాటించడం మంచింది. ముఖం కనిపించకుండా కేవలం కాళ్ల ఫోటోలు మాత్రమే షేర్ చేయడం సురక్షితం. కేవలం గుర్తింపు పొందిన వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు జరపాలి. ఇంటర్నెట్‌లో ఒకసారి ఫోటో అప్‌లోడ్ చేస్తే అది ఎప్పటికీ అక్కడే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరో ముఖ్య గమనిక ఏంటంటే ఇది ఒక వింత ధోరణిగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక ఆర్థిక మోసాలు, సైబర్ వేధింపుల ముప్పు పొంచి ఉంది. కాబట్టి యువత ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
