AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏది అంటే.. వజ్రాలు, బంగారు ఆభరణాలు లేదా లగ్జరీ కార్ల పేర్లు చెబుతాం. కానీ కేవలం ఒకే ఒక్క పుస్తకం విలువ అక్షరాలా రూ.1,250 కోట్లు అంటే మీరు నమ్ముతారా? అవును.. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నూటికి నూరు పాళ్లు నిజం. పుస్తకాల ప్రపంచంలోనే అత్యంత అరుదైన నిధిగా నిలిచిన ఆ పుస్తకం గురించి తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..
Most Expensive Book In The World
Krishna S
|

Updated on: May 17, 2026 | 10:19 PM

Share

పుస్తకాల ప్రపంచంలో కొన్ని అరుదైన నిధులు ఉంటాయి. కాలం మారినా వాటి విలువ తగ్గకపోగా.. కోట్లాది రూపాయలకు చేరుకుంటుంది. అలాంటి వాటిలో అగ్రస్థానంలో నిలిచే ఒక అద్భుతమైన చారిత్రక నిధే గూటెన్‌బర్గ్ బైబిల్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకంగా పరిగణించబడే ఈ బైబిల్ విలువ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం ఒక పూర్తి గూటెన్‌బర్గ్ బైబిల్ విలువ 25 మిలియన్ల నుండి 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.200 కోట్ల నుండి రూ.1,250 కోట్ల అన్నమాట. అయితే ఇంత డబ్బు మూటగట్టుకుని వెళ్లినా ఈ పుస్తకాన్ని ఇప్పుడు కొనడం ఎవరితరం కాదు. ఎందుకంటే ఈ అరుదైన ప్రతులు అమ్మకానికి సిద్ధంగా లేవు. మానవ చరిత్ర గతిని మార్చిన ఈ అద్భుత కళాఖండం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు మీకోసం…

మానవ చరిత్రను మార్చిన ముద్రణ

ఈ పుస్తకాన్ని జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఆవిష్కర్త జోహన్నెస్ గూటెన్‌బర్గ్ సుమారు 1455లో జర్మనీలోని మైంజ్ నగరంలో ముద్రించారు. పాశ్చాత్య ప్రపంచంలో కదిలే అక్షరాలతో ముద్రించబడిన మొట్టమొదటి పెద్ద పుస్తకం ఇదే. ఆధునిక ముద్రణ యుగానికి నాంది పలికిన ఈ లాటిన్ వల్గేట్ బైబిల్.. ఐరోపాలో జ్ఞానాన్ని, అక్షరాస్యతను వేగంగా వ్యాప్తి చేయడానికి సహాయపడింది. ఐరోపాలో పునరుజ్జీవనం, సంస్కరణ ఉద్యమాల పెరుగుదలకు ఈ పుస్తకమే ప్రధాన కారణం కావడంతో దీని చారిత్రక ప్రాముఖ్యత అమూల్యమైనదిగా మారింది.

180 ప్రతులు ముద్రిస్తే.. మిగిలింది ఇవే

జోహన్నెస్ గూటెన్‌బర్గ్ ప్రారంభంలో మొత్తం 180 ప్రతులను మాత్రమే ముద్రించారు. కానీ అవి కాలగర్భంలో కలిసిపోగా.. ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా లేదా పాక్షికంగా కేవలం 49 ప్రతులు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఈ పుస్తకంలోని ప్రతి పేజీలోనూ అందమైన చేతివ్రాతను తలపించే అక్షరాలు, రంగురంగుల అలంకరణలు, అత్యుత్తమ నాణ్యత గల కాగితం ఉంటాయి. అందుకే దీనిని కేవలం ఒక పుస్తకంగానే కాకుండా మధ్యయుగ కాలపు అత్యంత అద్భుతమైన కళాఖండంగా పరిగణిస్తారు.

డబ్బున్నా ఎందుకు కొనలేరు?

ఈ పుస్తకం ప్రతులలో చాలా వరకు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రభుత్వాలు లేదా ప్రపంచంలోని గొప్ప గ్రంథాలయాలు, ప్రసిద్ధ మ్యూజియంలు, అగ్రశ్రేణి యూనివర్సిటీల ఆధీనంలో చాలా భద్రంగా ఉన్నాయి. పరిశోధనల కోసం చారిత్రక సంపదగా వీటిని దాచారు తప్ప మార్కెట్లో ఎక్కడా వీటిని అమ్మకానికి ఉంచరు. ఒక పూర్తి ప్రతి చివరిసారిగా 1978లో 2.4 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. ఆ కాలంలోనే అది ఒక భారీ రికార్డు మొత్తం. నేటి లెక్కల ప్రకారం ఈ పుస్తకం వేలానికి వస్తే దాని విలువ కనీసం 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే పలుకుతుందని నిపుణుల అంచనా.

Follow Us
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ