AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వెండి రంగు వెనుక దాగిన ఆకలి కేకను గుర్తించిన చిన్నారి.. చూస్తే కళ్లలో నీళ్లు తిరగాల్సిందే!

బాల్యం అంటేనే పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాల్సిన వయసు. ఆటలు, పాటలు, చదువులతో గడపాల్సిన ఆ పవిత్రమైన దశలో కొందరు పిల్లలు మాత్రం పొట్టకూటి కోసం వీధుల్లో పోరాడాల్సి వస్తోంది. అలాంటి ఒక హృదయాలను తాకే దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సమాజం ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తోంది.

Viral Video: వెండి రంగు వెనుక దాగిన ఆకలి కేకను గుర్తించిన చిన్నారి.. చూస్తే కళ్లలో నీళ్లు తిరగాల్సిందే!
Little Girl Feeds Street Performer Boy
Balaraju Goud
|

Updated on: May 17, 2026 | 7:47 PM

Share

బాల్యం అంటేనే పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాల్సిన వయసు. ఆటలు, పాటలు, చదువులతో గడపాల్సిన ఆ పవిత్రమైన దశలో కొందరు పిల్లలు మాత్రం పొట్టకూటి కోసం వీధుల్లో పోరాడాల్సి వస్తోంది. అలాంటి ఒక హృదయాలను తాకే దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సమాజం ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తోంది.

ఆ వీడియోలో ఒక చిన్న బాలుడు మహాత్మా గాంధీ వేషధారణలో రోడ్డుపై కనిపించాడు. ఒంటి నిండా వెండి రంగు పూసుకుని, గుండ్రని కళ్లజోడు ధరించి, తలకు రంగులు వేసుకుని ఒక సజీవ విగ్రహంలా రోడ్డు పక్కన నిలబడ్డాడు. అది ఏ స్కూల్ ఫంక్షనో కాదు, కేవలం నాలుగు డబ్బులు సంపాదించి ఆకలి తీర్చుకోవడం కోసం ఆ చిన్నారి వేసుకున్న వేషం. చుట్టూ ఉన్న జనం అతడిని ఒక వింతలా చూస్తూ, ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు తప్ప, ఆ వెండి రంగు వెనుక దాగున్న నిస్సహాయతను ఎవరూ గమనించలేదు. ఆ అబ్బాయి కూడా జనం డబ్బులు ఇస్తారనే ఆశతో, కనురెప్ప కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి తన పాత్రను పోషిస్తూ ఉంటాడు.

కానీ, సమాజంలోని పెద్దలు గుర్తించని ఆకలిని, అక్కడికి వచ్చిన ఒక చిన్న అమ్మాయి కనిపెట్టింది. ఆ బాలుడి దీనస్థితిని చూసి చలించిపోయిన ఆ పాప, తన చేతిలోని తినుబండారాన్ని అతనికి తినిపించడానికి ప్రయత్నిస్తుంది. మొదట ఆ బాలుడు కదలకుండా విగ్రహంలాగే ఉంటాడు. తాను కదిలితే ప్రజలు డబ్బులు ఇవ్వరేమోననే భయం ఒకవైపు, కడుపును నలిపేస్తున్న ఆకలి మరోవైపు అతడిని వేధిస్తాయి.

చివరకు ఆకలి ముందు ఏ పాత్ర అయినా తలవంచాల్సిందే కదా! ఆ చిన్నారి పదే పదే బతిమాలడంతో, ఆకలిని తట్టుకోలేక ఆ బాలుడు అకస్మాత్తుగా నోరు తెరిచి, ఆమె చేతిలోని ఆహారాన్ని ఆత్రుతగా అందుకున్నాడు. ఈ ఒక్క దృశ్యం చూసేవారి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. “ప్రపంచమంతా అతనితో ఫోటోలు దిగడంలో బిజీగా ఉంటే, ఒక చిన్నారి మాత్రం అతని ఆకలిని గుర్తించింది” అనే సందేశంతో ఉన్న ఈ వీడియో, బాల కార్మిక వ్యవస్థ, పేదరికంపై మన కళ్లు తెరిపిస్తోంది. ప్రతి బిడ్డకు అందమైన బాల్యం దక్కాలనే ఆకాంక్షను ఈ కథనం గుర్తుచేస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి
వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం
వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం
పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..
బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..
రెట్రో లుక్‌, లేటెస్ట్‌ ఫీచర్లతో కొమోడోర్‌‌ ఫ్లిప్‌ ఫోన్‌
రెట్రో లుక్‌, లేటెస్ట్‌ ఫీచర్లతో కొమోడోర్‌‌ ఫ్లిప్‌ ఫోన్‌
అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?
అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?
అందరికీ సహాయం చేయొద్దు.. ఇలాంటి వ్యక్తులకు మేలు చేస్తే మీకే నష్టం
అందరికీ సహాయం చేయొద్దు.. ఇలాంటి వ్యక్తులకు మేలు చేస్తే మీకే నష్టం