AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న కుక్క..! ఈ మనుషులు పట్టించుకోరే..? తప్పక చూడాల్సిన వీడియో

మనుషుల కంటే మూగ జంతువులు చాలా మెరుగ్గా నియమాలను పాటిస్తాయి. ప్రస్తుతం అలాంటి క్రమశిక్షణ కలిగిన కుక్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క రోడ్డు దాటుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నట్లుగా చూపించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

Watch: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న కుక్క..! ఈ మనుషులు పట్టించుకోరే..? తప్పక చూడాల్సిన వీడియో
Dog Obeying Traffic Rules
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2024 | 1:29 PM

Share

ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల్లో కెల్లా మానవుడే అత్యంత తెలివైనవాడని అంటారు. చిన్నతనం నుండి మనకు ఏది సరైనది. ఏది తప్పు అని నేర్చుకుంటాం. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి చాలా సందర్బాల్లో వాటిని మరచిపోతుంటాం. ఇది తప్పని తెలిసినప్పటికీ, చాలా మంది వ్యక్తులు నిబంధనలను నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో తరచూ ప్రజలు ఇలాంటి తప్పులు చేస్తూ.. తమతో పాటుగా ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. కానీ మూగ జంతువులు అలా కాదు..ఒకసారి వాటికి ఏదైనా నేర్పించామంటే..అవి దానిని ఎప్పటికీ మర్చిపోవు. అది నిజాయితీ అయినా, ఇతరులను ప్రేమించడం అయినా, చెప్పిన నియమాలను పాటించడం అయినా సరే.. మనుషుల కంటే మూగ జంతువులు చాలా మెరుగ్గా నియమాలను పాటిస్తాయి. ప్రస్తుతం అలాంటి క్రమశిక్షణ కలిగిన కుక్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క రోడ్డు దాటుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నట్లుగా చూపించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

వైరల్ వీడియోలో, జీబ్రా క్రాసింగ్ ముందు ఒక కుక్క రోడ్డుపై నిలబడి ఉంది. ఒక క్రమశిక్షణ గల కుక్క రోడ్డు పక్కన నిలబడి ఉండగా దాని ముందు ఒక మహిళ మాత్రం క్రాసింగ్ వద్ద నిలబడి ప్రమాదకరంగా రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెడ్‌ సిగ్నల్‌తో వాహనాలు వెళ్తున్నాయి. సిగ్నల్ రెడ్ లైట్‌ ఉండగానే, సదరు లేడిగా నేరుగా రోడ్డు దాటి వెళ్లిపోతుంది. కానీ రెడ్ సిగ్నల్ గ్రీన్‌ లైట్‌ వచ్చే వరకు ఆ కుక్క అక్కడే నిలబడి ఉంటుంది. సిగ్నల్ గ్రీన్‌ లైట్‌ మారిన తర్వాతే అది రోడ్డు దాటింది. క్రమశిక్షణ కలిగిన ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో మూగ జంతువుకు తెలిస్తే.. మనుషులకు ఎందుకు అర్థం కావడం లేదంటూ చాలా మంది కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లోని మల్లాది_రాగ్స్ అనే పేజీలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, “బాధ్యతాయుతమైన క్రమశిక్షణ కలిగిన పౌరుడిగా ఉండండి” అని క్యాప్షన్ ఉంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో, చాలా మంది కుక్క చేసిన పనిని అభినందిస్తున్నారు. వీడియోపై రకరకాల కామెంట్స్‌ని పోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..