Watch: అవసరమా..? రీల్‌ చేద్దామని రిస్క్‌ చేసింది.. కట్‌ చేస్తే లైఫేలేకుండా పోయింది..!

రైల్వే నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లపై ఎలాంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయడం నేరం. కాబట్టి, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు, స్టేషన్‌లో సెల్ఫీలు తీసుకోవడం, రీళ్లు తయారు చేయడం మానుకోండి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.

Watch: అవసరమా..? రీల్‌ చేద్దామని రిస్క్‌ చేసింది.. కట్‌ చేస్తే లైఫేలేకుండా పోయింది..!
Railway Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 07, 2024 | 12:40 PM

రైల్వేకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా క్రేజ్ యువత తలెకెక్కిందని చెప్పాలి. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి, తమ ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం వారు ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు. దీని కోసం చాలాసార్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో రీలు తీస్తూ ఓ యువతి దారుణంగా మరణించింది.

వైరల్‌ వీడియోకు సంబంధించి… మెక్సికోలోని హిడాల్గోకు చెందిన ఒక సందర్భం. ఇక్కడ చాలా మంది రైల్వే ట్రాక్‌పై నిలబడి రైలు కోసం వేచి చూస్తున్నారు. అక్కడివారంతా ఈ రైలుతో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవాలని ఆరాటంగా ఉన్నారు. ఎందుకంటే.. ఇది ఆవిరి మీద నడిచే ఇంజిన్‌తో పనిచేస్తుంది. కెనడా నుండి మెక్సికో సిటీకి ఈ రైళ్లో ప్రయాణించవచ్చు. స్టీమ్‌ ఇంజిన్‌ రైలు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ట్రాక్‌లకు దగ్గరగా నిలబడి రైలు రాకకోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారి సంతోషం క్షణాల్లోనే దుఃఖంగా మారుతుందని ఎవరికీ తెలియదు. అది స్టీమ్‌ ఇంజిన్‌ రైలు.. మెరుపు వేగంతో దూసుకొచ్చింది. అక్కడ ఫోన్‌ పట్టుకుని నిలబడి ఉన్న ఆ యువతి రైలుతో సెల్ఫీ వీడియో తీస్తూ అమాంతంగా కుప్పకూలిపోయింది. వీడియో తీస్తున్న క్రమంలో ట్రాక్‌కు అతి సమీపంలోకి రావటంతో ఆమెను రైలు ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉన్న ఆమె స్నేహితులు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపుగానే ఘోరం జరిగిపోయింది. తోటి స్నేహితులు ఆమెను ఎంత పిలిచినా ఆమెలో ఎలాంటి చలనం కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

ఊహించని ప్రమాదంతో యువతి మృతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో ఇలాంటి వారంతా గుణపాఠం నేర్చుకోవాలని అంటున్నారు. ఇలా రీల్స్‌ పిచ్చితో తిరిగే వారు మన భద్రతను మనం తప్పక చూసుకోవాలంటున్నారు.. చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాలను బలిగొంటుంది అనడానికి ఇప్పటి వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

రైల్వే నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లపై ఎలాంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయడం నేరం. కాబట్టి, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు, స్టేషన్‌లో సెల్ఫీలు తీసుకోవడం, రీళ్లు తయారు చేయడం మానుకోండి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!