విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !!

టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణానికి టికెట్ల ధరలను రెండ్రోజుల పాటు లాక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ద్వారా విమాన టికెట్ ధరలు మారకుండా ప్రయాణికులు తమ ట్రిప్‌ ప్లాన్ చేసుకోవచ్చు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !!

|

Updated on: Jun 07, 2024 | 11:51 AM

టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణానికి టికెట్ల ధరలను రెండ్రోజుల పాటు లాక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ద్వారా విమాన టికెట్ ధరలు మారకుండా ప్రయాణికులు తమ ట్రిప్‌ ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా విమాన టికెట్‌ ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రయాణానికి తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు అమాంతం పెరిగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. విమాన టికెట్‌ ధరలు ఇలా మారిపోకుండా ఉండేందుకు ఫేర్‌ లాక్ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూగజీవుల పట్ల రైతు పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి !!

Aadhar: జూన్‌ 14 తర్వాత వారి ఆధార్‌ పనిచేయదా ??

Donald Trump: ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాలి

మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్‌ హీరో అంటూ ప్రశంసలు

అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్‌ లోయలో గుర్తింపు

Follow us
Latest Articles