అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్‌ లోయలో గుర్తింపు

చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన నీలిరంగు చీమలను గుర్తించారు పరిశోధకులు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ , ఫెరిస్‌ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం సియాంగ్‌ లోయలో ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది.

అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్‌ లోయలో గుర్తింపు

|

Updated on: Jun 07, 2024 | 11:43 AM

చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన నీలిరంగు చీమలను గుర్తించారు పరిశోధకులు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ , ఫెరిస్‌ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం సియాంగ్‌ లోయలో ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్‌ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్‌ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్‌ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదైనవిగా పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏందన్నా ఇదీ !! నీకు పెళ్లి చేసుకోడానికి పిల్లే దొరకలేదా

చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్‌

గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్‌

Follow us
Latest Articles