చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్‌

సాధారణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, అధికారులు సరిగా పనిచేయకపోయినా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసనలు తెలుపుతుంటారు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువులు కూడా నిరసన తెలిపేందుకు తమదైనశైలిలో ధర్నాలు చేస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అవును అటవీ ప్రాంతంలో ఉండే రెండు ఏనుగులు రోడ్డుకు అడ్డంగా చెట్లు పడగొట్టి నిరసనకు దిగాయి.

చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్‌

|

Updated on: Jun 07, 2024 | 11:39 AM

సాధారణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, అధికారులు సరిగా పనిచేయకపోయినా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసనలు తెలుపుతుంటారు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువులు కూడా నిరసన తెలిపేందుకు తమదైనశైలిలో ధర్నాలు చేస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అవును అటవీ ప్రాంతంలో ఉండే రెండు ఏనుగులు రోడ్డుకు అడ్డంగా చెట్లు పడగొట్టి నిరసనకు దిగాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం ఆ ఏనుగులకు ఏం అవసరమొచ్చిందో ఏమో… లేకపోతే ఆ రోడ్డున వెళ్తున్న చెరకు లారీలు ఆపకుండా వెళ్లిపోయాయో.. మా దారిలో వెళ్తూ మాకే టోల్‌ ఫీ కట్టకుండా వెళ్తారా అనుకున్నాయో ఏమో.. వెంటనే ఆ రోడ్డుకు పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేలా తన బలమైన దంతాలతో కూల్చేసింది ఓ ఏనుగు. ఆరోడ్డుకు మరో వైపునుంచి మరో పెద్ద ఏనుగు ఈ ఏనుగు నిరసనకు మద్దతుగా వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడింది. ఇంకేముంది. అటూ ఇటూ వచ్చే వాహనదారులు ఎక్కడివారక్కడే ఆగిపోయారు. ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసింది.ఈ అరుదైన దృశ్యం వీక్షకులను షాక్‌ అయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్‌

Follow us