గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్
తెల తెలవారుతోంది.. ఇక కాసేపట్లో అంతా నిద్ర లేస్తారు అనగా ఆ ఇంటి ఆవరణలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లోవారందరినీ నిద్ర లేపేందుకు ఆ ఇంటి పెరటి గోడపైకి వచ్చింది ఆ ఇంటి కోడి. అదే సమయంలో ఆ ఇంటి ఆవరణలోకి ఓ చిరుత కూడా ఎంట్రీ ఇచ్చింది. గోడపై కోడిని చూసి 10 అడుగుల ఎత్తయిన ఆ గోడొపైకి అమాంతం దూకింది. భయంతో కోడి మరోవైపుకు దూకింది.
తెల తెలవారుతోంది.. ఇక కాసేపట్లో అంతా నిద్ర లేస్తారు అనగా ఆ ఇంటి ఆవరణలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లోవారందరినీ నిద్ర లేపేందుకు ఆ ఇంటి పెరటి గోడపైకి వచ్చింది ఆ ఇంటి కోడి. అదే సమయంలో ఆ ఇంటి ఆవరణలోకి ఓ చిరుత కూడా ఎంట్రీ ఇచ్చింది. గోడపై కోడిని చూసి 10 అడుగుల ఎత్తయిన ఆ గోడొపైకి అమాంతం దూకింది. భయంతో కోడి మరోవైపుకు దూకింది. చిరుత వదులుతుందా.. వాయువేగంతో అటువైపు దూకింది.. పాపం కోడి తప్పించుకోలేపోయింది.. చిరుతకు ఆహారమైపోయింది. ఇ దృశ్యం మొత్తం ఆ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలో రికార్డయింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. మే 29న తెల్లవారుజామున 5 గంటలకు సోమయనూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీసీ పుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న ఆ ఇంటివారు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు కోయంబత్తూరులోని నివాస ప్రాంతంలో చిరుతపులి కనిపించటంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.. దీంతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు అటవీ శాఖ అధికారులు. సీసీటీవీలో చిరుత వేటకు సంబంధించిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారెవ్వా.. బుర్రుపిట్టలు తుర్రు మనేలా.. రైతు వినూత్న ఆలోచన
శునకానికి అరుదైన గుండె ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పశువైద్య నిపుణులు
సరస్సు నుంచి బయటపడ్డ ఇనుప పెట్టె !! తెరిచి చూడగ దెబ్బకి మైండ్ బ్లాక్
వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

