ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీవీ నటి రిధిమా పండిత్‌ తో అతడి పెళ్లి జరగనున్నట్లు నెట్టింట జోరుగా వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో వదంతులపై నటి రిధిమా పండిత్‌ క్లారిటీ ఇచ్చారు. క్రికెటర్‌ శుభ్‌మన్‌తో ఎలాంటి పరిచయం లేదన్నారు రిధిమా. బాలీవుడ్‌ టీవీ షో ‘బహు హమారీ రజనీకాంత్‌’తో రిధిమా పండిత్‌ బుల్లితెర ప్రేక్షకుల్లో వెరీ పాపులర్‌ అయింది.

ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??

|

Updated on: Jun 06, 2024 | 2:58 PM

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీవీ నటి రిధిమా పండిత్‌ తో అతడి పెళ్లి జరగనున్నట్లు నెట్టింట జోరుగా వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో వదంతులపై నటి రిధిమా పండిత్‌ క్లారిటీ ఇచ్చారు. క్రికెటర్‌ శుభ్‌మన్‌తో ఎలాంటి పరిచయం లేదన్నారు రిధిమా. బాలీవుడ్‌ టీవీ షో ‘బహు హమారీ రజనీకాంత్‌’తో రిధిమా పండిత్‌ బుల్లితెర ప్రేక్షకుల్లో వెరీ పాపులర్‌ అయింది. ఖత్రోన్‌ కీ ఖిలాడీ, బిగ్‌బాస్‌ ఓటీటీ తదితర రియాల్టీ షోస్‌లో మెరిసింది. టీవీ నటి రిధిమా, గిల్‌ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, ఈ ఏడాది డిసెంబరులో వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్‌లు వైరల్‌ అయినప్పటి నుంచి నటికి విపరీతమైన ఫోన్‌ కాల్స్ వచ్చాయట. దీంతో ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. జర్నలిస్టుల నుంచి అనేక కాల్స్‌ వచ్చాయి. ఇలా ఎప్పుడూ జరగలేదు. నా వివాహం గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు. నా జీవితంలో ఏదైనా జరిగితే స్వయంగా ప్రకటిస్తా అని రాసుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ దీని గురించి స్పందించింది. కొందరు కావాలనే ఈ కథను అల్లి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వ్యక్తిగతంగా శుభ్‌మన్‌ గిల్‌తో నాకు ఎలాంటి పరిచయం లేదు. నిన్న ఉదయం నుంచి శుభాకాంక్షల మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. విసిగెత్తిపోయి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టా అని తెలిపింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపారేసింది. శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లి, ప్రేమ గురించి గతంలోనూ పలుమార్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వడదెబ్బకు గురైన వానరానికి ఓఆర్ ఎస్.. మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్ల ప్రశంసలు

పాపం దొంగ !! చోరీకి వెళ్లి మందేసాడు.. మర్చిపోయాడు..  చివరికి ??

హార్దిక్ పాండ్యా-నటాషా కలిసిపోయారా ??

నోయిడాలో పేలుతున్న ఏసీలు.. మరి మీ ఏసీ సేఫేనా ??

Follow us