పాపం దొంగ !! చోరీకి వెళ్లి మందేసాడు.. మర్చిపోయాడు.. చివరికి ??
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ మద్యం మత్తులో పడి నిద్రపోయి మరుసటి రోజు పోలీసులకు చిక్కాడు. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టార్ - 20లోని ఆ ఇల్లు సునీల్ పాండే అనే వైద్యుడిది.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ మద్యం మత్తులో పడి నిద్రపోయి మరుసటి రోజు పోలీసులకు చిక్కాడు. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టార్ – 20లోని ఆ ఇల్లు సునీల్ పాండే అనే వైద్యుడిది. బలరామ్‌పూర్ ఆసుపత్రిలో పనిచేసే డా.పాండే ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఇంటిని ఖాళీగా ఉంచారు. అయితే, పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి పొరుగింటి వారికి సందేహం కలిగింది. వెళ్లి చూడగా అక్కడ ఓ దొంగ నిద్రిస్తూ కనిపించాడు. సామానంతా చెల్లాచెదురుగా పడి ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిద్రలేచిన దొంగ తన చుట్టూ పోలీసులు ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతీ వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. తలుపులు, కప్ బోర్డులు పగలగొట్టాడని అన్నాడు. గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు అక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐపీసీ 379 A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

