హార్దిక్ పాండ్యా-నటాషా కలిసిపోయారా ??

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్‌ చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు కారణం కూడా ఉంది. తన ఇన్‌స్టా ఖాతా నుంచి తమ వెడ్డింగ్ ఫొటోలను, తన పేరు నుంచి పాండ్యా అన్న సర్‌నేమ్‌ను నటాషా తొలగించడమే అందుకు కారణం. ఆ తర్వాత నటాషా.. బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగా కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.

హార్దిక్ పాండ్యా-నటాషా కలిసిపోయారా ??

|

Updated on: Jun 06, 2024 | 2:51 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్‌ చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు కారణం కూడా ఉంది. తన ఇన్‌స్టా ఖాతా నుంచి తమ వెడ్డింగ్ ఫొటోలను, తన పేరు నుంచి పాండ్యా అన్న సర్‌నేమ్‌ను నటాషా తొలగించడమే అందుకు కారణం. ఆ తర్వాత నటాషా.. బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగా కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఐపీఎల్‌లో పాండ్యా ముంబైకి సారథ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా స్టాండ్స్‌లో కనిపించకపోవడం.. ఇలా వరుస ఘటనలు ఈ రూమర్లు నిజమనుకునేలా చేశాయి. దీనికితోడు ఈ వార్తలపై అటు పాండ్యా కానీ, ఇటు నటాషా కానీ బహిరంగంగా స్పందించకపోవడంతో అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇదొక్కటే కాదు.. హార్దిక్ తన నికర ఆస్తిలో దాదాపు 70 శాతం వాటాను భార్యకు బదిలీ చేశాడన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా, నటాషా ఈ రూమర్లు అన్నింటికీ చెక్ పెడుతూ.. తమ పెళ్లి ఫొటోలను తిరిగి ఇన్‌స్టాలో రీస్టోర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు ఐదు రోజుల క్రితం బాంద్రా-వోర్లి సీ లింక్‌పై నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ సిరీస్‌లో పోస్టు చేసిన ఈ సెర్బియన్ మోడల్.. ‘దేవుడిని ప్రశంసించండి’ అని రాస్తూ ఎమోజీలు జోడించింది. అంతకుముందు మరో పోస్టులో.. ‘ఎవరో వీధుల్లోకి రాబోతున్నారు’ అని గుంభనంగా రాసుకొచ్చింది. తాజాగా, ఇప్పుడు తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో రీస్టోర్ చేసిన నటాషా రూమర్లకు తెరదించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోయిడాలో పేలుతున్న ఏసీలు.. మరి మీ ఏసీ సేఫేనా ??

Follow us