వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం

నల్గొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం తేలింది. వాటర్‌ ట్యాంక్‌లో అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. రొటీన్‌ తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంకులో నీళ్లు చెక్‌ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి, ట్యాంకును శుభ్రం చేయించారు.

వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం

|

Updated on: Jun 06, 2024 | 3:07 PM

నల్గొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం తేలింది. వాటర్‌ ట్యాంక్‌లో అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. రొటీన్‌ తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంకులో నీళ్లు చెక్‌ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి, ట్యాంకును శుభ్రం చేయించారు. తమకు తెలియకుండానే గత 10 రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటర్‌ ట్యాంక్‌లో కనిపించిన శవం హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు గత పది రోజుల నుంచి కనిపించకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అయితే అతడు తనకు తానుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నా డా? లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా? లేదంటే మరెవరైనా హత్య చేసి శవాన్ని అందులో పడేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు అది మంచినీళ్ల ట్యాంక్‌ కావడంతో గత పది రోజులుగా మున్సిపాలిటీలోని ప్రజలంతా అవే నీళ్లు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి తాగామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత కొద్ది రోజుల క్రితం నాగార్జునసాగర్‌లో ఇదే రీతిలో మరో దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట మరొకటి మినీ వాటర్‌ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషయం తెలియక అక్కడి ప్రజలు కలుషిత నీటినే సేవించారు. ఈ నేపథ్యంలో తాజాగా నల్గొండలోనూ మంచినీళ్ల ట్యాంకులో శవం తేలడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కలుషితాన్ని అరికట్టేందుకు, నీటి సరఫరాకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??

వడదెబ్బకు గురైన వానరానికి ఓఆర్ ఎస్.. మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్ల ప్రశంసలు

పాపం దొంగ !! చోరీకి వెళ్లి మందేసాడు.. మర్చిపోయాడు..  చివరికి ??

హార్దిక్ పాండ్యా-నటాషా కలిసిపోయారా ??

నోయిడాలో పేలుతున్న ఏసీలు.. మరి మీ ఏసీ సేఫేనా ??

Follow us