శునకానికి అరుదైన గుండె ఆపరేషన్‌ నిర్వహించిన ఢిల్లీ పశువైద్య నిపుణులు

శునకానికి అరుదైన గుండె ఆపరేషన్‌ నిర్వహించిన ఢిల్లీ పశువైద్య నిపుణులు

|

Updated on: Jun 06, 2024 | 3:13 PM

సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి ఢిల్లీలోని పశువైద్య నిపుణులు కోతలేని గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఏడేళ్ల వయసున్న జూలియట్‌ అనే శునకం రెండేళ్లుగా మైట్రల్‌ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి ఢిల్లీలోని పశువైద్య నిపుణులు కోతలేని గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఏడేళ్ల వయసున్న జూలియట్‌ అనే శునకం రెండేళ్లుగా మైట్రల్‌ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కుక్కల్లో వచ్చే గుండె సమస్యల్లో దీని వాటా 80 శాతంగా ఉంది. దీనివల్ల గుండె ఎడమ ఎగువ గదిలో రక్తప్రవాహం వెనక్కి మళ్లుతుంది. ఈ వ్యాధి ముదిరేకొద్దీ ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పెరిగిపోతుంది. క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సమస్య ఉన్న జూలియట్‌కు ఢిల్లీలోని మ్యాక్స్‌ పెట్జ్‌ ఆసుపత్రి నిపుణులు.. ట్రాన్స్‌కెథతర్‌ ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ రిపెయిర్‌ అనే ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి దీన్ని చేపట్టారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను పూర్తిచేశారు. మే 30న ఈ శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సరస్సు నుంచి బయటపడ్డ ఇనుప పెట్టె !! తెరిచి చూడగ దెబ్బకి మైండ్ బ్లాక్

వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం

ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??

వడదెబ్బకు గురైన వానరానికి ఓఆర్ ఎస్.. మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్ల ప్రశంసలు

పాపం దొంగ !! చోరీకి వెళ్లి మందేసాడు.. మర్చిపోయాడు..  చివరికి ??

Follow us