ఏందన్నా ఇదీ !! నీకు పెళ్లి చేసుకోడానికి పిల్లే దొరకలేదా
గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకడం లేదని యువకుల రోదనలు ఎక్కువయ్యాయి. వివాహం చేసుకోవడానికి అమ్మాయి అందుబాటులో ఉండడం లేదని .. రోజు రోజుకీ అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ అవుతుందని చాలా మంది ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓ యువకుడు కూడా తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరకకపోవడంతో చేసేదిలేక గేదెను పెళ్లి చేసుకున్నాడు.
గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకడం లేదని యువకుల రోదనలు ఎక్కువయ్యాయి. వివాహం చేసుకోవడానికి అమ్మాయి అందుబాటులో ఉండడం లేదని .. రోజు రోజుకీ అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ అవుతుందని చాలా మంది ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓ యువకుడు కూడా తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరకకపోవడంతో చేసేదిలేక గేదెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ సీన్‌ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్నఈ వీడియోలో ఒక యువకుడు గేదెను వివాహం చేసుకున్నాడు. ఇందులో ఓ యువకుడు గేదెను తీసుకొచ్చి నిల్చున్నాడు. పెళ్లి బట్టల్లో ముస్తాబై రెడీగా ఉన్న యువకుడు గేదె మెడలో వరమాల వేశాడు. ఆ తర్వాత తనమెడలో తానే వరమాల వేసుకున్నాడు. అనంతరం గేదె నుదుటన సిందూరం దిద్దాడు. ఆపై గేదె వీపుపైన అందమైన చీరను కప్పాడు. ఆ తర్వాత యువకుడి తల్లి వధూవరులిద్దరికీ దిష్టితీసి, కోడలని ఆహ్వానించింది. యువకుడు సంతోషంతో గేదె వీపుపైనెక్కి వెళ్లాలనుకున్నాడు. ఆనందంగా గేదె వీపుపైకెక్కి కూర్చున్నాడు. అంతే నాలుగుడుగులు వేసిందో యువకుడ్ని కింద పడేసి తుర్రుమని పారిపోయింది. పాపం కాలుకి దబ్బతగిలి నడవడానికి ఇబ్బంది పడుతున్న వరుడికి స్నేహితుడు సాయం చేయగా కుంటుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. యువకుడితో పెళ్లి ఆ గేదెకు ఇష్టం లేనట్టుందని, విడాకులకోసం కోర్టుకెళ్తే ఆరునెలల పడుతుంది.. టైం వేస్ట్ అనుకుందేమో.. అని మరికొందరు ఫన్నీకామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్
గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

