మూగజీవుల పట్ల రైతు పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి !!

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలే కాదు, పశుపక్ష్యాదులు సైతం అల్లాడిపోయాయి. ఈ క్రమంలో ఓ రైతు తమ ఇంట పెంచుకునే పాడి పశువుల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడు. తమ జీవనానికి ఎంతగానో తోడ్పడుతున్న మూగ జీవులను కంటికి రెప్పలా కాపాడుకోవడం యజమాని ధర్మం. అదే చేశారు ఆ రైతు కూడా. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఎండవేడితో అల్లాడుతున్న పాడి గేదెలకు ఏసీ, ఫ్యాన్‌ ఎరేంజ్‌ చేశాడు.

మూగజీవుల పట్ల రైతు పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి !!

|

Updated on: Jun 07, 2024 | 11:49 AM

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలే కాదు, పశుపక్ష్యాదులు సైతం అల్లాడిపోయాయి. ఈ క్రమంలో ఓ రైతు తమ ఇంట పెంచుకునే పాడి పశువుల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడు. తమ జీవనానికి ఎంతగానో తోడ్పడుతున్న మూగ జీవులను కంటికి రెప్పలా కాపాడుకోవడం యజమాని ధర్మం. అదే చేశారు ఆ రైతు కూడా. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఎండవేడితో అల్లాడుతున్న పాడి గేదెలకు ఏసీ, ఫ్యాన్‌ ఎరేంజ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏసీ ఆన్ చేస్తే ఎక్కడ కరెంట్‌ బిల్లు పేలిపోతుందోనని కాసేపు వేసి ఆపేస్తారు చాలామంది. అలాంటిది.. ఓ పాడి రైతు ఏకంగా తన గేదెల కోసం ఏసీ పెట్టించాడు! అది కూడా ఒకటి కాదు రెండు ఏసీలు, రెండు ఫ్యాన్లను షెడ్డులో బిగించాడు! ఎండల వేడి నుంచి మూగజీవాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వీడియోలో గేదెలు రెండు ఏసీల నుంచి వచ్చే చల్లదనంతోపాటు ఓ సీలింగ్ ఫ్యాన్, మరో టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే చల్ల గాలిని ఆస్వాదిస్తూ కనిపించాయి. హాయిగా గడ్డి నెమరేస్తూ సేదతీరాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం హర్యానా భాషలో పాట వినిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. తన పశువుల పట్ల పాడి రైతు చూపుతున్న ప్రేమకు ముచ్చటపడుతున్నారు. గుల్జార్ సాహెబ్ పేరుతో ఉన్న ఓ యూజర్ ‘ఎక్స్’లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. డబ్బున్న నగరవాసులారా.. మీ దర్పాన్ని మరింత ప్రదర్శించండి అంటూ ఆ వీడియో కింద కామెంట్ జత చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhar: జూన్‌ 14 తర్వాత వారి ఆధార్‌ పనిచేయదా ??

Donald Trump: ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాలి

మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్‌ హీరో అంటూ ప్రశంసలు

అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్‌ లోయలో గుర్తింపు

ఏందన్నా ఇదీ !! నీకు పెళ్లి చేసుకోడానికి పిల్లే దొరకలేదా

Follow us