AP News: 3 కోళ్లను మింగి సైలెంట్‌గా ఇంట్లోకి దూరిన కొండచిలువ.. ఆ తర్వాత
కొండచిలువలు తాము తినాలనుకునే జీవులపై ఒక్కసారిగా దాడి చేసి గట్టిగా చుట్టేసి పట్టు బిగించి నలిపేస్తాయి. ఆ తరువాత మింగేస్తాయి. పెద్ద పెద్ద జీవులును సైతం అరిగించుకోగల సామర్థ్యం వాటికి ఉంటుంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేపనపల్లి గ్రామంలో భారీ కొండచిలువ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోకి మూడు కోళ్లు మింగి ఇంట్లోకి వెళ్లింది. అది గమనించిన స్థానికులు కొండచిలువను చౌకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కొండచిలువల దవడలు ఎక్కువగా సాగుతాయి.. అందుకే అవి ఆహారాన్ని పూర్తిగా మింగేస్తాయి. ఎంత పెద్ద జీవి అయినా… దాన్ని అమాంతం మింగేయడం కొండచిలువకు సాధ్యమవుతుంది. సాధారణంగా కొండచిలువలు కూడా మిగతా పాముల్లాగే ఎలుకలు, ఇతర చిన్నచిన్న జీవుల్ని ఆహారంగా తీసుకుంటాయి. కానీ, వయస్సు పెరిగి… పరిమాణంలో బాగా పెద్దవయ్యాక వాటికి చిన్నచిన్న జీవులు సరిపోవు. పెద్ద జంతువుల కోసం అన్వేశిస్తూ ఉంటాయి. పందులు, దుప్పులు, ఆవులు.. ఇలా ఏ జీవి కనిపించినా వదలిపెట్టవు. అవి సాధ్యం కానంత పెద్ద జీవిని తినడానికి ప్రయత్నించి విఫలం అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సరైన ఆహారం దొరక్కపోతే… చిన్నచిన్న జీవులపై ఆధారపడుతూ పెద్ద జంతువు కనిపించేవరకు ఇవి కాలం వెళ్లదీస్తుంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..