Roja vs Rajinikanth: అర్థమైందా రాజా.. ! రోజాని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అప్పట్లో ఒకసారి విజయవాడకి వచ్చారు. రజినీకాంత్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు. ఎన్నో సంవత్సరాల నుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది. రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు కూడా.
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అప్పట్లో ఒకసారి విజయవాడకి వచ్చారు. రజినీకాంత్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు. ఎన్నో సంవత్సరాల నుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది. రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు కూడా.. రజినీకాంత్ ఒక అగ్ర నటుడు, తనకన్నా సీనియర్ నటుడు, సహచర నటుడు అని చూడకుండా వైసీపీ ఎంఎల్ఏ రోజా ఘాటుగా విమర్శించారు. రజినీకాంత్ కి ఆంధ్ర పాలిటిక్స్ ఏం తెలుసనీ, రజినీకాంత్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు రోజా. ఆమెతో పాటు విమర్శలకు దిగారు వైసీపీ ఎమ్మల్యే కొడాలి నాని.
తరువాత ఒక సినిమా ఫంక్షన్ లో రజినీకాంత్ ఇలాంటివాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండదు, అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా’, అని చెప్పారు. రజినీకాంత్ మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు నెటిజన్స్ అదే వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, తరువాత రజినీకాంత్ చెప్పిన మాటలు కూడా ఎడిట్ చేసి వీడియోలు పెడుతూ వైరల్ చేస్తున్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులూ ఘోరంగా పరాభవం పాలయ్యారు. కొడాలి నాని కౌంటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యలోనే బయటకి వెళ్లిపోయిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.