‘బుల్లెట్ బండి’ క్రేజ్ మాములుగా లేదు.. పాటకు స్టెప్పులేసిన ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి.!
బుల్లెట్ బండి పాట హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా’ అనే పాట ఏప్రిల్ 7న యూట్యూబ్‌లో..
బుల్లెట్ బండి పాట హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా’ అనే పాట ఏప్రిల్ 7న యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది మొదలు దూసుకుపోతోనే ఉంది. ‘ డుగ్గు డుగ్గు’ అంటూ ఈ పాట నెట్టింట్లో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసిన బుల్లెట్ బండి.. పాటే వినిపిస్తోంది. చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లుగా, కాలర్ ట్యూన్స్‌గా, పెళ్లి వేడుకల్లో.. ఇలా ఎక్కడ చూసిన ఈ పాటే మారుమోగుతోంది.చిన్నా, పెద్దా అందరూ ఈ పాటకు స్టెప్పులేసేస్తున్నారు.
ఎంతో పాపులరైన హుషారెత్తించే ఈ పాటకు తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణీ డాన్స్ చేశారు. మంత్రి నారాయణస్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్ బండి పాటకు సరదాగా డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!